Guess The Movie : ఒక సినిమా హిట్ ను ఈరోజుల్లో కలెక్షన్లను బట్టి డిసైడ్ చేస్తున్నారు. ఓ మూవీ బడ్జెట్ కంటే ఎక్కువ కలెక్షన్లు సాధిస్తే హిట్ లేకపోతే ఫ్లాప్. టాలీవుడ్ లో ఈ మధ్య చిత్ర కలెక్షన్లు వంద కోట్లు దాటడం అనేది సర్వసాధారణమైంది. బడా హీరోల నుంచి యంగ్ హీరోల వరకు కంటెంట్ ఉంటే అందరి సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. అయితే గతంలో మాత్రం సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనే విషయాన్ని ఇలా కలెక్షన్లలో కాకుండా ఆ సినిమా థియేటర్లలో ఆడినన్ని రోజులను బట్టి డిసైడ్ చేసేవారట.
అందుకే అంతకుముందు సినిమాలు 100 డేస్, 200 డేస్ అంటూ మాట్లాడుకునే వారు. దాదాపు 2000 సంవత్సరం వరకు సినిమాల హిట్ ను ఎన్ని టిక్కెట్లు అమ్ముడుపోయాయి, ఎన్ని రోజులు ఆడింది అనే దాన్ని బట్టే చూసేవారు. ఇప్పుడు సినిమాలు వంద కోట్లు వేయి కోట్లు కలెక్షన్లు సాధించినా నెల తిరగకముందే థియేటర్ లో నుంచి మాయమైపోతున్నాయి.. ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి.
ప్రస్తుతం కాలంలో దక్షిణాది నుంచి వచ్చిన “ఆర్ఆర్ఆర్”, “బాహుబలి”, “కేజీఎఫ్” లాంటి పాన్ ఇండియా మూవీస్, బాలీవుడ్ లో విడుదలైన “జవాన్” లాంటి సినిమాలు వందలు, వేల కోట్ల కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. అయితే కమర్షియల్ హిట్ సాధించినప్పటికీ ఈ సినిమాలు టిక్కెట్ల విషయంలో వెనకే ఉన్నాయి. ఈ సినిమాలు అప్పటి ఓ సినిమా దరిదాపులకు కూడా చేరుకోలేకపోయాయి.
ఆ సినిమా మరేదో కాదు. రమేశ్ సిప్పీ డైరక్షన్లో వచ్చిన “షోలే”. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని కీలక పాత్ర పోషించారు. బాక్సాఫీసు రికార్డు వివరాల ప్రకారం 1975-80 కాలంలో విడుదలైన ఈ సినిమాకు అప్పట్లో కేవలం ఇండియాలోనే 18కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయట. సోవియట్ రష్యాలో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చూసేందుకు 4.8కోట్ల టికెట్లు విక్రయించగా.. మొత్తంగా ఈ సినిమాను అప్పట్లోనే 25 కోట్ల మంది వీక్షించారని తెలిసింది.
అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన “షోలే” సినిమా విడుదలైన తర్వాత దాదాపు రెండు వారాల వరకూ ప్లాప్ టాక్‌ను మూట గట్టుకోగా మూడో వారం నుంచి పుంజుకుందట. మొత్తంగా రూ.30కోట్ల వరకు వసూలు చేసింది. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా రిలీజైన బాహుబలి- 2కు 15-20 కోట్ల టిక్కెట్లు, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్- 2, దంగల్ సినిమాలకు 10 కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం.