Allu Arjun అసిస్టెంట్ డైరెక్టర్‎గా పనిచేసిన సినిమా ఏదో తెలుసా ?

- Advertisement -

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడో తెలిసిందే. ఆయన చివరిగా పుష్ప సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న మొదటి స్టార్ హీరోగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కెరీర్లో వరుసగా భారీ విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్.. తన సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారట. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. శ్రీకాంత్, వేణు, సునీల్ ప్రధాన పాత్రలో నటించిన పెళ్ళాం ఊరెళితే సినిమా అప్పట్లో ఎలాంటి బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళంలో హిట్ గా నిలిచిన చార్లీ చాప్లిస్ మూవీకి రీమేక్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ కూడా ఒకరు. ఈ నేపథ్యంలో ఆయ‌న సూచనల మేరకు సినిమాకు అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించాడట. అదే టైంలో బన్నీకి.. ఎస్వీ కృష్ణారెడ్డి అంటే బాగా భయం ఉండేదట. ఈ విషయాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి ఓ సందర్భంలో స్వయంగా వివరించాడు. అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. దాని తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్టులతో కూడా భారీ పాన్‌ ఇండియా లైనప్ ఏర్పాటు చేసుకున్నాడు.

- Advertisement -
Allu Arjun
Allu Arjun

ఇక ఈ సినిమా హిందీ హక్కులు, ఓటీటీ హక్కులు రికార్డ్ సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో సినిమాకు దక్కని విధంగా భారీ ధరకు అమ్ముడుపోయాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా బిజినెస్ విషయంలో మేకర్స్ పూర్తిస్థాయిలో సంతృప్తి చెందుతున్నారట. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులకు కూడా గట్టి పోటీ ఏర్పడింది. కొన్ని ఏరియాలో మైత్రి నిర్మాతలు స్వతహాగా ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నార‌ట‌. ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో టార్గెట్ ను రీచ్ అవ్వడానికి మేకర్స్ మరింత శ్రమిస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా టాక్ ను బట్టి బన్నీ మార్కెట్ ఏ రేంజ్‌కు వెళ్తుంది అనే విష‌యంపై క్లారిటి వ‌స్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here