తెలుగులో ప్రభంజనం సృష్టించిన హాలివుడ్ సినిమా అవతార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. భారీ హిట్ ను అందుకుంది.. ఆ తర్వాత సీక్వెల్ గా అవతార్ 2 కూడా వచ్చింది. ఆ సినిమా కూడా మంచి హిట్ టాక్ తో పాటు కలెక్షన్ల సునామి సృష్టించింది..అవతార్ 2’ సినిమా ఓటీటీలోకి వచ్చి చాలా రోజులు అయింది. అయితే అక్కడ మీకు సబ్‌స్క్రిప్షన్ ఉన్నా.. సినిమాను చూసే అవకాశం ఇవ్వలేదు. మళ్లీ ఆ సినిమాను చూడటానికి అదనంగా డబ్బులు పే చేయాల్సి వచ్చేది.. ఆ సినిమా భారీ హిట్ ను అందుకోవడం తో చాలా మంది సినిమాను చూడటానికి ఆసక్తి చూపించారు…

అయితే ఇప్పుడు అవతార్ 2 చూడాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది టీమ్.. ఇక మీదట ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా సినిమాను చూడవచ్చు..జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్ 2’. ‘అవతార్’ సినిమా వచ్చిన దాదాపు 13 సంవత్సరాల తర్వాత ‘అవతార్ 2’గా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ వచ్చింది. 2022 డిసెంబర్‌లో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా మీద కాస్త నెగిటివ్ వ్యూస్ బయటకు వచ్చినా.. విజువల్ ఫీస్ట్ అనే పేరుతో సినిమా దూసుకుపోయింది.. భారీ హిట్ ను నమోదు చేసుకుంది..

ఓటీటీలో మార్చి 28 నుండి సినిమా అందుబాటులోకి వచ్చింది. యాపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, వుడు, గూగుల్ ప్లే, ఎక్స్ ఫినిటీ, ఏఎంసీ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి ఫ్లాట్ ఫామ్స్‌లో ఈ సినిమా ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇవన్నీ పెయిడ్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 19.9 డాలర్లు / సుమారు రూ. 1640 పెట్టి సినిమా చూడాల్సి ఉంటుంది.. జూన్ 7 న ఈ సినిమాను మళ్లీ ఓటీటిలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది.. అప్పుడు ఎటువంటి చార్జీ లేకుండా చూడవచ్చు.. ఈ సినిమా విజువల్స్ వండర్గా అందరిని మెప్పించింది.. ఇప్పటికి సినిమా క్రేజ్ తగ్గలేదని తెలుస్తుంది.. అవతార్ 3 కూడా వస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..