Hyper Aadi : అందరూ చూస్తుండగా స్టేజి మీద హైపర్ ఆదికి ముద్దు పెట్టిన అమ్మాయి ..!

- Advertisement -

Hyper Aadi : బుల్లితెర మీద ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు అనే విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళు చూస్తారు కాబట్టి షోస్ కచ్చితంగా సంస్కారవంతంగా, చూడచక్కని విధంగా ఉంటూ, నవ్వుకునే విధంగా ఉండాలి. కానీ ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ షోస్ హద్దులన్నీ దాటేస్తున్నాయి. స్టేజి మీద ముద్దులు పెట్టుకోవడం, రొమాన్స్ చెయ్యడం చాలా కామన్ అయిపోయింది.

Hyper Aadi
Hyper Aadi

ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే పాపులార్ ఎంటర్టైన్మెంట్ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కూడా ఈ మధ్య అలాగే తయారైంది. ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించేవాడు. ఆ తర్వాత ఆయన ఈటీవీ కి దూరం అవ్వడం తో యాంకర్ రష్మీ ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తుంది. ఇక హైపర్ ఆది చేసే కామెడీ ఈ షో కి హైలైట్ గా ఉంటుంది.

sri devi drama company

ఇది ఇలా ఉండగా ఈరోజు జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో హైపర్ ఆది ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. ఆమె తన ప్రేయసి అని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని చెప్తాడు. హైపర్ ఆది ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ వేదిక పై నాకు ఘోరమైన అవమానం జరిగింది. మన ప్రేమ ఏంటో నిరూపించడానికి అర్జెంటు గా ఎదో ఒకటి చేసేయాలి అని అంటాడు.

- Advertisement -

అప్పుడు ఆ అమ్మాయి హైపర్ ఆది బుగ్గ మీద ముద్దు పెట్టి అందరిని షాక్ కి గురి చేస్తుంది. ఈ ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవ్వడం తో కుటుంబం మొత్తం చూసే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఏమిటి ఈ రచ్చ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి హైపర్ ఆడికి నిజంగానే కాబొయ్యే భార్యనా?, లేదా కేవలం స్కిట్ కోసం తీసుకొచ్చాడా అనేది తెలియాల్సి ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here