Kona Venkat : ఆశకు హద్దుండాలి.. అంజలి విషయంలో ట్రోల్స్ కు గురవుతున్న నిర్మాత.. ఫ్లాప్ సినిమాకు ఏకంగా రూ.50 కోట్లట..!

- Advertisement -

Kona Venkat : ప్రముఖ నటి అంజలి నటించిన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ఎటువంటి బజ్ లేకుండా నిన్న విడుదలైంది. ఇది అంజలికి 50వ సినిమా కావటం ఆసక్తికరం. కోన వెంకట్ కథ, నిర్మాణ సారధ్యం వహిస్తే, శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే నిన్న పాత్రికేయుల కోసం ఒక మల్టి ప్లెక్స్ లో వేసిన ఈ సినిమాకి కేవలం పాత్రికేయులు, ఆ సినిమాకి సంబందించిన వారు తప్పితే మామూలు సినిమా ప్రేక్షకులు లేకపోవటం ఇంకో ఆసక్తికరమైన విశేషం. నిన్న ఉదయం ఆట అయిపోగానే ఈ సినిమా ఫలితం ఏంటి అనేది అందరికీ తెలిసిపోయింది.

Kona Venkat
Kona Venkat

విశ్లేషకులు కూడా ఈ సినిమా గురించి అంత పెద్దగా ఏమీ పట్టించుకున్నట్టు కనిపించలేదు. అలాగే ఈమధ్య టాలీవుడ్ లో కొత్త ఆనవాయితీ ఒకటి బయలుదేరింది. ఉదయం ఆట ఇంకా ముగియకుండానే, ఆ సినిమా విజయోత్సవాలు జరుపుకోవటం, వీలైతే కొన్ని టపాసులు కూడా కాల్చి తమ సినిమా కలెక్షన్స్ సాధించినా, లేకపోయినా విజయం సాధించింది అనే ఒక చిన్న సంతృప్తి కోసం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా కూడా నిన్ననే విజయోత్సవ సభ జరిగింది.

- Advertisement -

ఆశకు అంతుండాలి అని సామెత వుంది కదా, అచ్చం అలాగే మాట్లాడేరు ఈ సభలో ఈ సినిమా రచయిత, నిర్మాత కోన వెంకట్. తన 27 సంవత్సరాల కెరీర్ లో మొదటిసారిగా విజయం అనేది ఎంత ముఖ్యం అనే విషయం చెపుతూ, అది ఒక బలం, శక్తి ఇస్తుంది అని చెప్పారు కోన వెంకట్. సక్సెస్ వస్తే కొత్త సినిమాలు, కొత్త దర్శకులు, కొత్త సాంకేతిక నిపుణలని, కొత్త నటుల్ని పరిచయం చెయ్యడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here