Renu Desai: రేణుదేశాయ్ కి పొగరు, ఆటిట్యూడ్ చూపిస్తుందిని తెలిసే.. ఇండస్ట్రీకి పరిచయం చేశా.. గీతాకృష్ణ వైరల్ కామెంట్స్..

- Advertisement -

Renu Desai: సినీ డైరెక్టర్ గీత కృష్ణ గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు.. తీసింది తక్కువ సినిమాలే అయినా కానీ.. సోషల్ మీడియాలో తనదైన శైలిలో ఇంటర్వ్యూ ఇస్తూ హల్చల్ చేస్తూ ఉన్నారు.. తరచూ సినీ సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. తాజాగా రేణు దేశాయ్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

Renu Desai
Renu Desai

గీత కృష్ణ పలువురు సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ.. తమన్నా, సమంతా వంటి వారిని ఇండస్ట్రీకి నేనే పరిచయం చేశానని చెప్పుకొచ్చారు. రేణు దేశాయిని కూడా ఇండస్ట్రీకి ముందుగా నేనే పరిచయం చేశానని.. కాకపోతే ఈ విషయం ఎవరికీ తెలియదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక సినిమా కోసం కొంతమంది మోడల్స్ ఫోటోలను పంపమని సుష్మ అనే మోడల్స్ మీడియేటర్ ను నేను ముంబైలో కలిశాను. ఆమె నాకు రేణు దేశాయ్ ఫోటోలను చూపించారు..

ఈ ఫోటో నచ్చి తన గురించి నేను అడుగగా.. మోడల్ మీడియేటర్ సుష్మ వెంటనే ఈ అమ్మాయి ఎందుకు తనకు చాలా పొగరు, ఆటిట్యూడ్ చూపిస్తుంది అని చెప్పింది.. కానీ అవేమీ పట్టించుకోకుండా గీతాకృష్ణ ఆ ఫోటో వెనక ఉన్న నెంబర్ కి ఫోన్ చేసి రేణు దేశాయ్ తో మాట్లాడి ఆడిషన్ కి రమ్మని పిలిచారట..

- Advertisement -

గీతాకృష్ణ రేణు దేశాయిని చూడగానే.. నీకు పొగరు అని సుష్మా చెప్పింది అని అనగానే.. అంటే తాను చేయమని చెప్తే చెత్త పనులను నేను చేయను అని చెప్పా అందుకే అలా అన్నట్టుంది అని రేణు దేశాయ్ అంతకు ముందు జరిగిన విషయాన్ని గీతాకృష్ణకు చెప్పిందట. ప్రభుదేవాతో రేణు దేశాయ్ ఒక సినిమాలో తీసుకోవడానికి సెలక్షన్ చేశారట కానీ.. ఆ సమయంలో రేణు ఫెమీనా కాంపిటీషన్ కి ఎంపిక కావడంతో ఆ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయిందని తెలిపారు. ఇక రేణు ఫోటో చూసిన ప్రభుదేవా తన నెక్స్ట్ తమిళ సినిమాలో పెట్టుకున్నారట. అలా రేణుని సౌత్ కి పరిచయం చేసింది గీతాకృష్ణను అని చెప్పుకొచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here