Bigg Boss Divi : హైదరాబాదీ అందం.. సొట్టబుగ్గల సుందరి.. దివి వ్యాధ్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. గతంలో ఎన్ని సినిమాలలో నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్ షో లో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.. తన అందం, అభినయం తో పాటు తన ఆట తీరు తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఆ తరవాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటించే ఆఫర్ కొట్టేసింది.. కానీ ఆ తరవాత మరిన్ని ఆఫర్స్ కోసం సోషల్ మీడియాలో అటెన్షన్ క్రియేట్ చేయడానికి తన ఘాటు అందాలను విందు చేసి విస్తరిలో వడ్డిస్తోంది..
బిగ్ బాస్ దివి సోషల్ మీడియా వేదికగా మనసులో గుబులు రేపుతోంది. గ్లామరస్ ఫోటో షూట్ చేస్తూ గుండెలకు గాయం చేస్తుంది . తాజాగా చీర కట్టులో పల్లె పడుచులా మారింది .వరి చేనుగట్టు మీద కూర్చొని పరువాల విందు చేసింది. కసిగా నడుము అందాలను చూపిస్తూ వయ్యారాలు వలకబోసింది.. టెంప్ట్ అవుతున్న కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు..
దివి ఘాటు అందాలను చూసి తట్టుకోలేకపోయిన ఓ నేటిజన్ .. ఎర్ర చీరలో కైపెక్కించే అందంలో ఒక్కసారిగా దివిని చూడగానే తన గుండెకి వలపు బాణాలు తగిలాయట.. ఎవరైనా బాణాలు గుచ్చుకోగానే చనిపోతారు కదా.. అందుకే ఆ నేటిజన్ తనపై దివి హత్యాయత్నం చేసిందంటూ కామెంట్ చేశాడు. అందంతో హత్యాయత్యానికి పాల్పడిన పోలీసు శాఖ వారు కేసు నమోదు చేయాలి అంటూ సదరు నెటిజన్ కామెంట్ చేశారు.
ప్రస్తుతం ఆ నేటిజన్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దివి ఈ కామెంట్ పై ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.. మొత్తానికి రోజురోజుకీ గ్లామర్ డోస్ పనిచేస్తూ సొట్ట బుగ్గల సుందరి అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.