ఫైమాను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్న ప్రవీణ్.. షాక్ లో ఫైమా

- Advertisement -

బుల్లితెరపై ఎంతోమంది కమెడియన్స్ వారి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తూ వెండి తెరపై కూడా అవకాశాలను దక్కించుకుంటున్నారు.ఈ విధంగా బుల్లితెరపై ప్రసారమైన పటాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన వారిలో ప్రవీణ్, ఫైమా జంట ఒకటని చెప్పచ్చు.

జబర్దస్త్ ప్రవీణ్
జబర్దస్త్ ప్రవీణ్

ఏదో ఒక ఈవెంట్ అని స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తారు. అందులో ఎవరో ఒక ఇద్దరు సెలబ్రెటీలకు లవ్ సాంగ్ పెట్టేసి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గట్టిగా కొట్టి.. లవ్ సింబల్స్ వేసేసి.. చివరికి వాళ్ల మెడలో దండలు వేసేసి పెళ్లి చేసేస్తారు. అప్పుడెప్పుడో మొదలైన మల్లెమాల నుంచి ఇప్పుడు వస్తున్న కొత్త ప్రోగ్రామ్స్ వరకూ అందరిదీ ఇదే ఐడియా. ఇలా హడావిడి చేసి ఫేమస్ అయిన జంటల్లో ఫైమా, ప్రవీణ్ జంట ముందుంటుంది.

Jabardasth praveen marriage

లేడీ కమెడియన్‌ ఫైమాతో అతను చేసిన స్కిట్లు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. టీవీ షోల్లో చాలా సార్లు లవర్స్‌గా కనిపించిన ఈ జోడీ రియల్ లైఫ్‌లోనూ ప్రేమలో ఉన్నారనుకుంటున్నారు చాలామంది. అయితే అటు ప్రవీణ్‌ కానీ, ఇటు ఫైమా కానీ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఈ ప్రచారం ఇలా సాగుతుండగానే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని షాక్‌ ఇచ్చాడు పటాస్‌ ప్రవీణ్‌.

- Advertisement -

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు . ‘ఫైమా’ ను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకున్నావా’, ‘ఇప్పుడు ఫైమా పరిస్థితేంటి’ , ‘ఈ అమ్మాయి ఎవరు? ‘ మీ ఇద్దరికి ఎలా పరిచయం’ అంటూ ప్రవీణ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. అదేంటంటే.. జబర్దస్త్ ప్రవీణ్‌ పెళ్లి చేసుకుంది నిజ జీవితంలో కాదు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కోసం ఇలా పెళ్లి కొడుకుగా మారాల్సి వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here