Fahadh Faasil : అరుదైన వ్యాధితో బాధపడుతున్న పుష్ప విలన్

- Advertisement -

Fahadh Faasil : మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. 41 ఏళ్ల వయస్సులో తనకు అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) వ్యాధి తనకు నిర్ధారణ అయినట్లు తెలిపాడు. ఇది మెదడు పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఫహాద్ ఫాజిల్ వివరించాడు. ఈ వ్యాధి సోకిన వారిలో ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఈ వ్యాధి పెద్దలకు అరుదుగా వస్తుందని.. చిన్న పిల్లల్లో సాధారణమని ఫహాద్ ఫాజిల్ పేర్కొన్నారు.

కేరళలోని కోతమంగళంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమానికి ఫహాద్ ఫాజిల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏడీహెచ్‌డీ వ్యాధి చికిత్స గురించి డాక్టర్‌ను అడిగారు. 41 ఏళ్ల వయసులో చికిత్స చేయించుకోవచ్చా? లేదా? అన్న వివరాలు తెలుసుకున్నారు. చిన్నతనంలోనే ఈ వ్యాధి బయటపడితే చికిత్స ద్వారా నయం చేయచ్చని, 41 ఏళ్ల వయసులో అసాధ్యమని డాక్టర్‌ సూచించినట్లు ఫహాద్ ఫాజిల్ పేర్కొన్నారు. అంటే జీవితాంతం మలయాళ స్టార్ ఏడీహెచ్‌డీ వ్యాధితో బాధపడాల్సిందే. ఈ విషయం తెలిసిన అందరూ ఫహాద్ ఫాజిల్ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

తెలుగులోనూ ఫాహద్ ఫాజిల్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. లెక్కల మాస్టర్ సుకుమార్‌ డైరెక్షన్లో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’లో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా నటించి ప్రశంసలు పొందారు. రెండో పార్టులో ఆయన పాత్ర నిడివి కాస్త ఎక్కువగా ఉంటుంది. పుష్ప, షెకావత్‌ పాత్రకు మధ్యలో చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయట. ఇప్పటికే ఫహాద్ ఫాజిల్ కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. పుష్ప 2 ఆగస్టు 15న భారీ అంచనాల మధ్య రిలీజ్ కానుంది. మరోవైపు ఇటీవలే ఆవేశంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇది ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here