Hansika : కోలీవుడ్ బ్యూటీ హన్సిక చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ భామ 16 ఏళ్ల వయసులోనే టాలీవుడ్లో దేశముదురు సినిమాతో అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో వైశాలిగా తన నటన, అందంతో ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీతోనే బంపర్ హిట్ కొట్టింది. ఇంకేం వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. దేశముదురు తర్వాత హన్సికకు అంతలా హిట్ ఇచ్చిన సినిమా ఒక్కటి లేదు. క్రమంగా ఈ భామ తెలుగు తెరకు దూరమైపోయింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది. అక్కడే వరుస సినిమాలు చేస్తోంది. హన్సిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తన ఫ్యామిలీతో కలిసి రీల్స్ చేస్తూ ఉంటుంది. ఏదో రకంగా తన అభిమానులను హన్సిక అలరిస్తూనే ఉంటుంది. ఇక ఈ బ్యూటీ ఫొటోషూట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ భామ బ్లాక్ కలర్ ఔట్ఫిట్లో ఫొటోషూట్ చేసింది. అవి కాస్త నెట్టింట పెట్టేసింది. ఇంకేం క్షణాల్లోనే ఆ ఫొటోలు వైరల్ అయిపోయాయి.
పెళ్లి తర్వాత గ్లామర్ షోలో హద్దులు చెరిపిస్తోంది హన్సిక. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ ఔట్ఫిట్లో నెట్టింట హీట్ పుట్టించింది. థైస్ స్లిట్ డ్రెస్సులో బ్యాక్ అందాలు ఎక్స్పోజ్ చేస్తూ తన థండర్ థైస్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది హన్సిక. ఘాటు పోజులిస్తూ మత్తెక్కించే చూపులతో కుర్రకారును రెచ్చగొట్టింది. బ్యాక్ లెస్ ఔట్ఫిట్లో తన బ్యాక్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ మత్తెక్కించే పోజులిస్తూ నెట్టింట సెగలు పుట్టించింది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు తెగ వైరల్ అయిపోతున్నాయి.
ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. యాపిల్ బ్యూటీ అందమే వేరు బాసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోజురోజుకు హన్సు మరింత అందంగా తయారవుతోందంటున్నారు నెటిజన్లు. ఇక ఈ ఔట్ఫిట్లో హన్సిక గ్లామర్ ట్రీట్ అదుర్స్ అంటూ ఫైర్ ఎమోజీస్‌తో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. హన్సిక ఇటీవలే సోహైల్ అనే బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది. పారిస్ ఐఫిల్ టవర్ వద్ద అతడు ప్రపోజ్ చేసిన ఫొటోలు పోస్టు చేసి తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంది హన్సిక. ఆ తర్వాత కొద్దిరోజులకే ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది.