Deepika Padukone : కడుపుతో ఉండి కూడా అలాంటి పనులు చేస్తు్న్న దీపిక పదుకొనే

- Advertisement -

Deepika Padukone : కొంతమంది అందగత్తెలు హీరోయిన్లుగా సినిమా రంగంలోకి అడుగుపెడతారు..కానీ ఆ హీరోయిన్ స్టేటస్ ని కేవలం తమ సరదాలు తీర్చుకోవడానికి.. డబ్బు సంపాదించుకోవడానికి.. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటారు. కానీ కొందరు మాత్రం నిబద్ధతతో తమ ప్రాణాలను పణంగా పెట్టి షూటింగ్‌లలో పాల్గొంటారు. ఈ జాబితాలోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె చేరింది.

అంతర్జాతీయ గుర్తింపు సంపాదించుకున్న దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి అందరి మనసులను దోచేసుకుంది. తెలుగు జనాలకి కూడా దీపికా పదుకొనే అంటే అమితమైన ఇష్టం. ఆమె యాక్టింగ్ స్టైల్ ను బాగా ఇష్టపడుతూ ఉంటారు . ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అన్న సంగతి మనకు తెలిసిందే. 2024 ఆగస్టులో ఆమె తన బిడ్డకు జన్మనివ్వబోతుంది. అయితే సాధారణంగా ఇలాంటి టైంలో కచ్చితంగా అందరు రెస్ట్ తీసుకుంటారు. హీరోయిన్స్ కూడా చాలామంది అదే పని చేస్తారు.

- Advertisement -

కానీ, దీపికా పదుకొనే మాత్రం తన బేబీని రిస్క్ లో పెట్టి మరీ షూటింగ్లో పాల్గొంటుంది. రోహిత్ శెట్టి చిత్రం సింగం అగైన్ సెట్స్ నుంచి కొన్ని పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పిక్చర్స్ లో దీపికా పదుకొనే బేబీ బంప్ తో కనిపించింది. ఇది చూసిన అభిమానులు షాక్ అయిపోతున్నారు. ఇలాంటి మూమెంట్లో కూడా షూటింగ్ అవసరమా..? అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు కమిట్మెంట్ డెడికేషన్ అంటే ఇదే అంటూ పొగిడేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీస్ ఆఫీసర్ లుక్ లో దీపిక అదిరిపోయింది అంటుంటే.. మరి కొందరు హాట్సాఫ్ మేడం అంటూ పొగిడేస్తున్నారు . దీపికాను ఈ రేంజ్ లో పొగడటం చూసి తన భర్త రణవీర్ సింగ్ సైతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here