Trishaపెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఈ హీరోనేనా..

- Advertisement -

Trisha : ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ నటి త్రిష.భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.అభిమానులు ‘‘సౌత్ క్వీన్ ” గా పిలుస్తారు.వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమైనప్పటికీ ఇటీవలే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈభామ తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైయిపోయింది. ఇకనాలుగు పదుల వయసు లో కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటూ సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.అలాంటి ఈ హీరోయిన్ ఇప్పటికే ఎంతోమంది హీరోలతో ప్రేమలో పడి బ్రేకప్ చెప్పుకుంది.

Trisha
trisha

ఇక ఈమె సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగత విషయాలపరంగా ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. అంతేకాదు ఈమె బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా మామూలుగా ఉండదు. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, శింబు, రానా, విజయ్ వంటి స్టార్ హీరోలతో ఈ హీరోయిన్ ప్రేమాయణం నడిపించింది. అలాంటి హీరోయిన్ బిజినెస్ మాన్ వరుణ్ మానియన్ (Varun maniyan) తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్గా చేసుకుంది. అయితే అనుకోకుండా ఇద్దరి మధ్య దూరం పెరిగి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.

Trisha Marriage

వీళ్ల నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడానికి ప్రముఖ హీరో రజనీకాంత్ అల్లుడు ధనుష్ కారణమట. త్రిష తన ఎంగేజ్మెంట్ కి తెలుగు తమిళ ఇండస్ట్రీ నుండి చాలామంది సెలబ్రిటీలకు ఆహ్వానం పంపించింది.అందులో భాగంగానే ధనుష్ ని కూడా త్రిష ఆహ్వానించింది. కానీధనుష్ వారి ఎంగేజ్మెంట్ కి రావడం త్రిష (Trisha) కి కాబోయే భర్త వరుణ్ మానియన్ కి అస్సలు ఇష్టం లేదు.

- Advertisement -

ఎందుకంటే అప్పటికే ధనుష్ తో వరుణ్ కి ఓ విషయంలో గొడవ జరిగింది. తనతో గొడవ పడిన వ్యక్తిని ఎలా పిలిచావని త్రిషకు కాబోయే భర్త ఆమెను నిలదీశాడు. ఇక ఈ విషయంలోనే వారిద్దరికీ గొడవ అయిందని అందుకే త్రిషకు పెళ్లిపై విరక్తి వచ్చిందని ఇక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుందని నెటిజన్లు అనుకుంటుంటారు. కొన్ని వారాలుగా చెన్నై చేందిన వ్యాపారవేత్తతో ఏడు అడుగులు వేస్తున్న త్రిష అంటూ వార్త సోషల్ మీడియాలో వస్తున్న వాటిని ఆమె ఖండిస్తూ. అవన్నీ రూమర్స్ అని ఆమె కొట్టిపారేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here