Ester Noronha : టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది ఎస్తర్ నోరోన్హా. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ ‘భీమవరం బుల్లోడు’, ‘గరం’, ‘జయ జానకి నాయక’ లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి పలు సినిమాల్లో చేసింది. అదే సమయంలో ప్రముఖ సింగర్, బిగ్ బాస్ ఫేం నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ జంట ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయింది. పెళ్లైన ఏడాదిలోపే విడాకులు తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇద్దరి అలవాట్లు కలవకపోవడం, చిన్న చిన్న విషయాల్లోనూ ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వీరు విడిపోవడానికి కారణమని తెలుస్తుంది.

ఇప్పటికే హీరోయిన్ గా, గాయకురాలిగా పరిచయం ఉన్న ఎస్తర్.. తన కలల ప్రాజెక్ట్ ‘ది వేకెంట్ హౌస్’ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు, సాహిత్యం అందించడంతో పాటు పాటలు, మ్యూజిక్ కూడా సమకూర్చారు. ఇక ఈ సినిమాకు డైరెక్షన్ కూడా చేసి తనలోని మల్టీ టాలెంట్‌ను బయటపెట్టారు. కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకోవాలని ఆమె చూస్తున్నారు. దానిలో భాగంగానే ‘రెక్కీ’లో భర్త ఉండగానే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న గృహిణి పాత్రలో ఎస్తర్ అద్భుతంగా నటించారు.
నటిగా ఎస్తర్ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే.. బుల్లితెర కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది. ఓటీటీ ప్రాజెక్ట్స్ లోనూ అవకాశాలు అందుకుంటుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలు పంచుకుంటుంది. ఈ క్రమంలోనే బెడ్ రూమ్ లో దిగిన ఫొటోలను షేర్ చేసింది ఈ అమ్మడు. దీంతో బాగా లావు అయ్యావ్ జిమ్ కు వెళ్తావా అని ఓ నెటిజన్ అడుగగా.. లేదు పిచ్చి ఆస్పత్రికి వెళ్తానని సమాధానం ఇచ్చింది. ఇక మరో నెటిజన్ భర్తకు విడాకులు ఇచ్చి బెడ్ రూంలో ఒక్కదానివే ఈ పని చేస్తున్నావా అంటూ కామెంట్ చేయగా.. నా ఇష్టం అంటూ రిప్లై ఇచ్చింది ఎస్తర్.
View this post on Instagram