Chiranjeevi : రోజంతా కష్టపడి పని చేసి ఇంటికి వచ్చి కాసేపు మనకి ఉపశమనం ఇచ్చేందుకు ఒకప్పుడు టీవీ చూసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ వృద్ధిలోకి రావడం తో అనేక ఛాయస్లు వచ్చాయి. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ ఇలా అన్నీ సోషల్ మీడియా మాధ్యమాలలో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందుతుంది. కుర్రోళ్లకు కచ్చితంగా సోషల్ మీడియా ఉపశమనం కలిగించే సాధకం.
కానీ పెద్దవాళ్ళు కూడా ఈమధ్య రిలాక్స్ అవ్వడం కోసం సోషల్ మీడియా నే ఆశ్రయిస్తున్నారు అంటే దాని ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మన టాలీవుడ్ లో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా కి దాసోహం అయినా వ్యక్తి అనే సంగతి మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ని ఈయన రేంజ్ లో నేటి తరం స్టార్ హీరోలు కూడా వాడలేరు అనేది అక్షర సత్యం.

చిరంజీవి పని ఒత్తిడిలో ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ ని చూడడం అలవాటు అట. ఎక్కువగా ఆయన ప్రకృతి కి సంబంధించిన ఆహ్లాదకరమైన వీడియోలను చూసేందుకు ఇష్టపడుతాడట. ప్రతీ రోజు రాత్రి ఆ వీడియోలు చూడనిదే నిద్ర పెట్టాడట. 60 ఏళ్ళు దాటినా వయస్సు ఉన్నవాళ్ళు ప్రతీ రోజు రాత్రి 11 గంటల లోపే పడుకొని నిద్రపోతారు.

కానీ చిరంజీవి కి 7 పదులు వయస్సు దాటినా ఇలాంటి వీడియోస్ చూస్తే కానీ నిద్ర పట్టదు అనే విషయం తెలుసుకొని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వసిష్ఠ అనే దర్శకుడితో ‘విశ్వంభర’ అనే చిత్రం చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే మరో మైలు రాయిగా నిల్చిపోతుందట. వచ్చే ఏడాది లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.