Hi Nanna ట్రైలర్ లో ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? ట్విస్టులు మామూలు రేంజ్ లో లేవుగా!

- Advertisement -

న్యాచురల్ స్టార్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ Hi Nanna ‘ వచ్చే నెల 7 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ‘దసరా’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత నాని చేస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు భారీ గా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కూడా ఉండడం తో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.

Hi Nanna
Hi Nanna

శౌరవ్ అనే దర్శకుడు ఈ చిత్రం తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. నిన్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ ని చూస్తుంటే మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా ఈ చిత్రం అనిపిస్తుంది. నాని కి ఆయన కూతురు కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తాది అనే విషయం అర్థం అవుతుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో నాని కి ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉందనే విషయం ఈ ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. ఆయన సతీమణి గా నటించింది ఎవరు?,ఇంతకు ఆమె చనిపోయిందా లేదా నాని తో విడిపోయిందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నిన్న విడుదలైన ట్రైలర్ లో ప్రముఖ స్టార్ హీరో శృతి హాసన్ ఉండడం మనమంతా చూసాము.

- Advertisement -
Shruti Haasan

నాని భార్య గా నటించింది ఆమెనే అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ శృతి హాసన్ కాకుండా మరో హీరోయిన్ కూడా ఉన్నట్టు ఈ అందమైన స్మైల్ ని చూస్తే అర్థం అవుతుంది. ఈ స్మైల్ ని బట్టీ చూస్తుంటే, ఈమె పూజా హెగ్డే లేదా ప్రియాంక మోహన్ అని అనుకుంటున్నారు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్. మరి ఈ చిత్రం లో మృణాల్ ఠాకూర్ మరియు శృతి హాసన్ కాకుండా నటించిన మరో యంగ్ హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here