Manchu Manoj హీరో మంచు మనోజ్ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. అత్యంత సన్నిహితులు అయినా వారిని మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వాణించినట్లు తెలుస్తుంది.. కేవలం బంధువులు మాత్రమే కాదు ఆయన ఫ్రెండ్స్ కూడా పెళ్లికి వచ్చి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.. అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి కూడా ఈ వివాహానికి వచ్చినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది..

మనోజ్ పెళ్లి జరిగిన రోజు రాత్రి ఆమె ఈ పెళ్లికి హాజరై మంచు మనోజ్ కి మౌనికాకు శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోయిందట. ప్రస్తుతం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. నిజానికి వీళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ విడిపోవడం మాత్రం గొడవలతో విడిపోలేదని.. స్వయంగా మనోజ్ పలు సందర్భాలలో తెలిపారు ఇప్పటికీ తనతో ప్రణతి రెడ్డి స్నేహపూర్వకంగానే ఉంటుందని.. తాను కూడా ఆమెతో ఒక వెల్ విషర్ గా ఉంటానని పలు ఇంటర్వ్యూలలో మంచు మనోజ్ వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు..
మంచు మనోజ్ తో విడిపోయాక ప్రణతి అమెరికాకు వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది..ఆ తర్వాత ఇల్లుస్ట్రేషన్ ఆర్టిస్ట్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రణతి రెడ్డి ప్రస్తుతం ఆవృత్తిలోనే బిజీగా గడుపుతోంది. అయితే ఆమె ఇప్పుడు మనోజ్ లాగా రెండవ పెళ్లి చేసుకోకుండా మొదటి వైవాహిక జీవిత క్షణాలను గడుపుతూ బతికేస్తోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. మరో వైపు ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వచ్చిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి..అయితే పెళ్లి మాత్రం ఆమె చేసుకోదట…ఏది ఏమైనా మంచు మనోజ్ రెండవ పెళ్లి చేసుకున్నాడు ఇది కూడా ప్రేమ పెళ్ళే.. కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి విభేదాలు లేకుండా సంతోషంగా జీవించాలని అభిమానులు కోరుకుంటున్నారు..