నిర్మాత దిల్ రాజు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..?

- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ 1 నిర్మాత ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు దిల్ రాజు. దాదాపుగా అందరి స్టార్ హీరోలతో సినిమాలు తీసి, ఎన్నో హిట్స్ బ్లాక్ బస్టర్స్ మర్చిపోలేని కల్ట్ క్లాసిక్స్ ని టాలీవుడ్ కి అందించాడు. అంతే కాదు ఒక సినిమాని ఎంత బడ్జెట్ లో తియ్యాలి, ఎంత లాభం వస్తుంది, ఎంత పోతుంది?, దానికి తగ్గట్టుగా ఏమి చెయ్యాలి అనేది దిల్ రాజు కి తెలిసినంత ఎవరికీ తెలియదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అందుకే ఎంత మంది నిర్మాతలు ఉన్నప్పటికీ కూడా దిల్ రాజు ఇన్ని సంవత్సరాలు టాలీవుడ్ లో ప్రైమ్ ఫామ్ తో కొనసాగుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్తి అయ్యింది.

ఇదంతా పక్కన పెడితే దిల్ రాజు కేవలం నిర్మాతగా మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఒక సినిమాకి పని చేసాడట. అక్కినేని నాగార్జున మొట్టమొదటి చిత్రం జోష్ లో దిల్ రాజు ఒక పాట పాడుతాడు. ఈ పాట ని ఆయన పాడడం మాత్రమే కాదు, సంగీత దర్శకత్వం కూడా వహించాడట.

- Advertisement -

ఇండస్ట్రీ లో దిల్ రాజు కి ఉన్నంత మ్యూజిక్ టేస్ట్ ఏ డైరెక్టర్ కి కూడా లేదు అని ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ వకీల్ సాబ్ సినిమా ప్రొమోషన్స్ సమయం లో ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. అందుకే బాగా గమనిస్తే దిల్ రాజు ప్రతీ సినిమాలో పాటలు అదిరిపోతుంటాయి. ఆయనలో ఉన్న ఈ సీక్రెట్ టాలెంట్ ఎదో ఒక రోజు ఒక సినిమాకి పూర్తి స్థాయి సంగీత దర్శకత్వం వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు పలువురు విశ్లేషకులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here