హీరోయిన్ దివ్య భారతి భర్త ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు

- Advertisement -

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సంచలనం సృష్టించి అతి తక్కువ సమయం లోనే ఎక్కువ సినిమాలు చేసి, అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అందం తో పాటు అద్భుతమైన అభినయం, మరియు చూపులు తిప్పుకోలేని రేంజ్ డ్యాన్స్ తో ఆకట్టుకునే హీరోయిన్స్ కి స్టార్ హీరో తో సరిసమానమైన ఇమేజ్ ఉండేది.

అలాంటి హీరోయిన్స్ లో ఒకరు దివ్య భారతి. అప్పట్లో ఈమె ఒక ప్రభంజనం, తమిళం లో ‘నీల పెన్నై’ అనే సినిమాతో వెండితెర కి పరిచయమైనా ఈ అందాలతార, ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘బొబ్బిలి రాజా’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఈ చిత్రం ఆమెకి రెండవ సినిమా, అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించడం తో దివ్య భారతి కి అవకాశాల వెల్లువ కురిసింది.

దివ్య భారతి
దివ్య భారతి

ఆ తర్వాత తెలుగు లో ‘అసెంబ్లీ రౌడీ’ మరియు ‘రౌడీ అల్లుడు’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలా కెరీర్ లో మొదటి మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యేలోపు ఈమెకి బాలీవుడ్ నుండి అవకాశాలు రావడం మొదలయ్యాయి. అక్కడ వరుసగా షారుక్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.

- Advertisement -

అలా 1990 వ సంవత్సరం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దివ్య భారతి, కేవలం మూడు సంవత్సరాలలోనే తెలుగు మరియు హిందీ భాషలకు కలిపి 21 సినిమాలు చేసింది. అంతే కాదు, ఆరోజుల్లో ఈమె ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా కూడా నిల్చింది. అయితే ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ నిర్మాత/రచయితా/ దర్శకుడు సాజిద్ నడియాద్ వాలా అనే అతనిని ప్రేమించి పెళ్లాడింది.

1992 వ సంవత్సరం లో వీళ్లిద్దరి పెళ్లి రహస్యం గా పెళ్లి చేసుకున్నారు. వీళిద్దరి పెళ్ళైన ఏడాదికే దివ్యభారతి ముంబైలోని తులసి బిల్డింగ్స్ లో తన ఫ్లోర్ బాల్కనీ నుండి జారీ క్రిందపడిపోయి చనిపోయింది. అక్కడ ఉన్నవాళ్లు ఇది గమనించి వెంటనే ఆమెని హాస్పిటల్ కి తీసుకొని పోగా అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

చాలా మంది అప్పట్లో భర్త సాజిద్ నడియాద్ వాలా నే బిల్డింగ్ మీద నుండి ఆమెని తోసేశాడని ఆరోపణలు కూడా వినిపించాయి, అయితే వాటికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం తో అది కేవలం ఒక రూమర్ గానే మిగిలిపోయింది. సాజిద్ నడియాద్ వాలా బాలీవుడ్ పెద్ద నిర్మాత మరియు దర్శకుడు. దివ్య భారతి చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన 2000 వ సంవత్సరం లో వార్దా ఖాన్ ని పెళ్లి చేసుకున్నాడు.

ఇప్పటికీ ఆయన సినిమాలను నిర్మిస్తూనే ఉన్నాడు, ప్రస్తుతం హౌస్ ఫుల్ 5 అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. ఇక దివ్య భారతి చనిపోక ముందు ఆమె బాలీవుడ్ లో 11 సినిమాలకు బుక్ అయ్యింది, ఆమె చనిపోయిన తర్వాత ఈ సినిమాలను శ్రీదేవి , కాజోల్ , జూహీ చావ్లా , టబు , పూజ భట్, కరిష్మా కపూర్ వంటి వారు పూర్తి చేసారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com