Ram Charan : మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రామ్ చరణ్. మొదటి సినిమా చిరుతతోనే సక్సెస్ కొట్టారు చెర్రీ.. వెంటనే వచ్చిన మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఇక అప్పటివరకు తాను చేసిన రెండో సినిమాతోనే ఈ రేంజ్ రికార్డులు ఏ హీరో కూడా క్రియేట్ చేయలేకపోయాడు. మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ వరుసగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాని టాలీవుడ్ లో తుఫాన్ పేరుతో రీమేక్ చేశారు.

అప్పట్లో ఆ సినిమా బాలీవుడ్, టాలీవుడ్ లోనూ భారీ ఫ్లాప్ అయింది. ఈ సినిమా సమయంలో బాలీవుడ్ కి చెందిన దీపిక పదుకొనెను హీరోయిన్గా నటించమని అడిగారట చిత్రబృందం. కాకపోతే ఆమె సినిమాను చేయనని రిజెక్ట్ చేసిందట. దాంతో ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కాగా రామ్ చరణ్ కి.. ప్రియాంక చోప్రాకు మధ్య కెమిస్ట్రీ సరిగా వర్కౌట్ కాలేదని అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ అని అభిమానులే ఒప్పుకున్నారు.

తుఫాన్ సినిమాలో నటించనని చెప్పినప్పటి నుంచి మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ దీపికా పదుకొనే అంటే కాస్త కోపం ఉంటుందట. తమ అభిమాన హీరోయిన్ మెగా పవర్ స్టార్ సినిమాని ఆమె రిజెక్ట్ చేయడమే వారికి కోపం తెప్పించింది. ఇక మొత్తానికి రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని జంజీర్ సినిమాతో వచ్చినప్పటికీ భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ చివరిగా నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో బాలీవుడ్ లో కూడా ఆయన జెండా పాతేశాడు. మొత్తానికి ఎక్కడైతే డిజాస్టర్ తో పడిపోయాడో అక్కడే మళ్లీ బ్లాక్ బ్లాక్ బస్టర్ తో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు.