రామ్ చరణ్ వాచ్ ధర ఎంతో తెలుసా.. రెండు సినిమాలు తియ్యొచ్చు..

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు..కొణిదెల వారి ఇంట మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది..పాప రాకతో మెగా ఇంట సంబరాలు జరుగుతున్నాయి. ఇక అభిమానులు, మెగా ఫ్యామిలీ, శ్రేయోభిలాషులు చెర్రీ ఉపాసన దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.. పాప పుట్టి నాలుగు రోజులు అవుతున్నా కూడా ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ గురించి ఎక్కువగా చెబుతున్నారు.. అయితే పాప పుట్టిన తర్వాత రామ్ చరణ్ – ఉపాసనలు శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు.. ఆ సమయంలో చెర్రి పెట్టుకున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్శించింది.. దాని ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

రామ్ చరణ్
రామ్ చరణ్

తనకు కూతురు పుట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆశీర్వదించిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. చరణ్ వాచ్ ధర వైరల్ అవుతుంది.. దాని ధర ఎంతో తెలిస్తే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. రిచర్డ్ మిల్లే బ్రాండ్ కు చెందిన వాచ్ ను చరణ్ ధరించారు. ఆ వాచ్ ధర ఎంతనే దానిపై కొందరు అభిమానులు సెర్చ్ చేశారు. అక్షరాల రూ.కోటీ 62 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్,, నెటిజన్లు షాక్ అవుతున్నారు.. ఈ డబ్బులతో రెండు చిన్న సినిమాలను తియొచ్చు అని కామెంట్లు పెడుతున్నారు..

ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నుంచి రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్స్ ట్రెండింగ్ గా మారుతున్న విషయం తెలిసిందే..రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్‘. తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రూపొందించడం మాత్రమే కాదు.. రోజూ రోజుకు సినిమా అంచనాలు పెరుగుతున్నాయి..ఇక వరుస సినిమాలను లైనప్ చేస్తున్నాడు రామ్ చరణ్..రామ్ చరణ్ త్వరలో రామాయణం సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రామాయణం ఆధారం పలు సినిమాలు రాగా.. ఇక లేటెస్ట్‌గా రామ్ చరణ్.. శ్రీరాముడిగా ప్యాన్ ఇండియా స్థాయిలో మరో రామాయణం రానుందని టాక్.. మరి ఆ సినిమా ఎప్పుడూ వస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here