సమంత విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాకు ముందనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?

- Advertisement -

రౌడీ బాయ్ విజయ్, బ్యూటీ క్వీన్ సమంత మొదటిసారి కలిసి నటించిన సినిమా ఖుషి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. వారితో పాటు జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ పలువురు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళ‌, క‌న్నడ, హిందీ భాష‌ల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. విజయ్ దేవరకొండ కెరీర్లో మరో గీత గోవిందం అవుతుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. చిత్ర బృందం ప్రమోషన్స్ తో సినిమా పై అంచనాలను మరింత పెంచుతున్నారు.

ఖుషి
ఖుషి

ప్రమోషన్లలో భాగంగా సినిమా దర్శకుడు శివ నిర్వాణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చిత్రానికి సంబంధించి పలు కీలక విషయాలు పంచుకున్నారు. ఖుషి సినిమా కథకు సమంత రియల్ లైఫ్ కు సంబంధం ఉంద‌ని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అందులో నిజం లేదని శివ నిర్వాణ తేల్చేశారు. అంతేకాకుండా తాను మూడేళ్ల క్రితమే ఈ సినిమా క‌థ రాసుకున్నట్లు తెలిపారు.

అలాగే ఈ సినిమాకు ఖుషి టైటిల్ నే ఎందుకు పెట్టారు..? అన్న ప్రశ్న అక్కడ ఎదురైంది డైరెక్టర్ శివ నిర్వాణకు.. దీనికి సమాధానంగా ఆయన “ఈ సినిమాకు మొద‌ట సరదాతో పాటు మరికొన్ని టైటిల్స్ అనుకున్నట్లు చెప్పారు. కానీ విజయ్, సమంతకున్న ఇమేజ్ తో సినిమాను పాన్ ఇండియా లెవల్ కు తీసుకెళ్లాలని భావించానని.. అప్పుడే ఐదు భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉండాలని అనుకుని ఈ ఖుషి టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు. క‌థ‌కు బాగా ఆ టైటిల్ బాగా యాప్ట్ అయిందన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here