Satna Titus : ‘బిచ్చగాడు’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో చూడండి!

- Advertisement -

Satna Titus : టాలీవుడ్ లో ఎన్నో ఊహించని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.టైటిల్ ని చూసి ఇదొక సినిమానా!, ఎందుకు తీస్తారో ఇలాంటి సినిమాలు అని అనుకుంటూ ఉంటాము.అలా అనుకున్న సినిమాలే చివరికి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి, వాటిల్లో ఒకటి ‘బిచ్చగాడు’ అనే చిత్రం.తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన ఈ సినిమా ముందుగా తమిళం లో విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

Satna Titus
Satna Titus

ఆ తర్వాత దీనిని తెలుగు లో రీమేక్ చేద్దాం అనుకున్నారు కానీ కుదర్లేదు, దాంతో దబ్ చేసి విడుదల చేసారు. మొదటి వారం రోజులు ఈ చిత్రానికి అసలు వసూళ్లే లేవు, రెండవ వారం నుండి టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ వద్ద దంచి కొట్టేసింది.ఆ రోజుల్లో ఈ సినిమా తో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం విడుదలైంది.ఆ సినిమా కంటే కూడా బిచ్చగాడు చిత్రానికి ఎక్కువ వసూళ్లు రావడం విశేషం.

Satna Titus Vijay antony

ఇక ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్స్ అందరూ దాదాపుగా కొత్తవాళ్లే.ముఖ్యంగా హీరోయిన్ సత్నా తీటస్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో ఆమెది డీ గ్లామర్ రోల్ అయ్యినప్పటికీ కూడా ఎవరీ అమ్మాయి, చాలా అందంగా మరియు హోమ్లీ గా ఉందే అని ఆడియన్స్ కి అనిపించింది.ఈమె మొదటి చిత్రం గురు సుక్రాన్ అనే లౌ బడ్జెట్ తమిళ సినిమా.ఇది 2015 వ సంవత్సరం లో విడుదలైంది, ఆ తర్వాత విజయ్ ఆంటోనీ ఈమెని బిచ్చగాడు సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు.ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో ఈమెకి తెలుగు మరియు తమిళం బాషలలో అవకాశాలు వెల్లువలాగ వచ్చాయి.

- Advertisement -
Bichagadu movie

కానీ ఆమె ఒప్పుకోలేదు,అప్పటి వరకు కమిట్ అయిన కొన్ని సినిమాలను పూర్తి చేసి సినిమాలకు శాశ్వతంగా గుడ్ బైన చెప్పేసింది.కారణం ఈమె 2016 వ సంవత్సరం లో ‘బిచ్చగాడు’ మూవీ డిస్ట్రిబ్యూటర్ కార్తీక్ ని ప్రేమించి, రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంది.ఈ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత తల్లితండ్రులు కార్తీక్ పై కేసు వేశారు.

మా అమ్మాయిని కావాలని ట్రాప్ లో దింపి పెళ్లి చేసుకున్నాడని, ఇందువల్ల మా అమ్మాయి సినీ కెరీర్ మొత్తం నాశనం అయ్యింది అని కేసు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళే కేసు వెనక్కి తీసుకొని వీళ్లిద్దరికీ 2017 వ సంవత్సరం లో అధికారికంగా మరోసారి ఘనంగా పెళ్లి చేసారు. పెళ్లి తర్వాత ఒప్పుకున్నా మూడు సినిమాలను పూర్తి చేసి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here