Ram Charan ధరించిన ఈ వాచ్ విలువ ఎన్ని కొట్లో తెలుసా..? ఒక సినిమానే తీసేయొచ్చు ఆ ధరతో!

- Advertisement -

Ram Charan : టాలీవుడ్ లేటెస్ట్ క్యూట్ ప్రేమ జంట వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి వివాహం నిన్న బంధుమిత్రుల సమక్షం లో ఇటలీ లో ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు మెగా హీరోలందరినీ ఒక చోట చూసేలోపు వారి ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి.

Ram Charan
Ram Charan

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ మెగా ఫ్యాన్స్ కి ఎంతో ప్రత్యేకం. వీళ్లిద్దరు బాబాయ్ – అబ్బాయి లాగ ఉండరు. తండ్రి కొడుకులు లాగ ఉంటారు, అంత ప్రేమ వీళ్లిద్దరి మధ్య ఉంటుంది కాబట్టే ఫ్యాన్స్ కి వీళ్ళ కలయిక ఎంతో ప్రత్యేకం. వీళ్లిద్దరు ఈ పెళ్ళికి చాలా సింపుల్ డ్రెస్ వేసుకొని వచ్చారు. పవన్ కళ్యాణ్ క్యాజువల్ టీ షర్ట్ వేసుకొని రాగా, రామ్ చరణ్ క్యాజువల్ షర్ట్ వేసుకొని వచ్చాడు.

Chiranjeevi naga babu pawan kalyan

వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో నిన్న సాయంత్రం సోషల్ మీడియా లో వచ్చింది. సోషల్ మీడియా లో వచ్చినప్పటి నుండి ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఇండియా మరియు శ్రీలంక మ్యాచ్ గురించి కూడా మర్చిపోయారు నెటిజెన్స్. ఆ రేంజ్ లో ఈ ఫోటో సోషల్ మీడియా లో తన డామినెన్స్ ని చూపించింది. అయితే ప్రతీ విషయాన్నీ చాలా క్షుణ్ణంగా గమనించే అలవాటు ఉన్న అభిమానులకు రామ్ చరణ్ వేసుకున్న వాచ్ ని గమనించారు.

- Advertisement -
Ram Charan Watch price

చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ వాచ్ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం అని గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. ఆ తర్వాత గా వాచ్ ధర చూసి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఈ వాచ్ ధర అమెరికన్ డాలర్స్ లెక్కలో రెండు లక్షల 80 వేల రూపాయిలు అట. ఇండియన్ కరెన్సీ కి మార్చి చూస్తే రెండు కోట్ల 30 లక్షల రూపాయిలు అన్నమాట, ఈ డబ్బుతో ఎన్ని ‘బలగం’ లాంటి సినిమాలను నిర్మించవచ్చో అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here