Allu Arjun కు పుష్ప సినిమా కాసుల వర్షాన్ని కురిపించడం మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్ ను కూడా చేసింది.. అంతేకాదు రెండు చేతులా సంపాదిస్తూ ఫుల్ బిజీ అయ్యేలా చేసింది కూడా.. రకరకాల సంస్థలకు అంబాసిడర్ అయ్యాడు.. Allu Arjun ప్రస్తుతం జోమాటో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. తెలుగు ఇండస్ట్రీలో బ్రాండ్ అంబాసిడర్ విషయం లో మహేష్ బాబు తర్వాత మరెవరైనా. మహేష్ బాబు 10 నుండి 15 కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అల్లు అర్జున్ నాలుగైదు కంపెనీల కంటే ఎక్కువ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. మొత్తానికి అల్లు అర్జున్ సినిమాలు తోనే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా బిజీగా ఉన్నాడని చెప్పుకోవాలి. ఆ మధ్య జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ తో ఒప్పందం కుదుర్చుకున్న అల్లు అర్జున్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం..
బన్నీ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అందుకే సౌత్ ఇండియా జొమాటో బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడంతో ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. తదుపరి సంవత్సరానికి ఒప్పందం కంటిన్యూ చేస్తే మరో 5 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నారట.. అంటే మరో ఏడాది కంటిన్యూ చేస్తే రూ.20 కోట్ల రూపాయలను అందుకోనున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే సంక్రాంతి కి పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది..