సినీ నటుడు నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఆయన భార్య అమల అందరికి తెలుసు.. నాగార్జున అమలను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. అంతవరకు అందరికి తెలుసు.. కానీ అమల ఎక్కడ నుంచి వచ్చింది.. ఆమె తల్లి దండ్రులు ఎవరు అనే విషయాలను గురించి చాలా మందికి తెలియదు.. అమల తల్లి ఏం చేస్తుంది వంటి విషయాల గురించి ఇప్పుడు వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

అమల తల్లిదండ్రుల విషయానికి వస్తే… తండ్రి బెంగాలీ నేవీ ఆఫీసర్ ముఖర్జీ కాగా, అమల తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. అమలా తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమలా తల్లి హాస్పిటల్ లో మేనేజ్మెంట్ జాబ్ చేసేవారు. వివాహ అనంతరం అమల తల్లిదండ్రులు వైజాగ్, చెన్నై వంటి ప్రదేశాలలో చాలాకాలం ఉన్నారు.. అయితే అమల ఒక్కటే కూతురు కావడంతో ఆమె ఆస్తి మొత్తం ఇక అమలదే.. అంటే అఖిల్ కు చెందుతుంది..

అమల, నాగార్జునలు మొదట రిలేషన్ లో ఉన్నారు.. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వివాహంతో ఒక్కటయ్యారు.. వివాహ అనంతరం అమల హైదరాబాదుకు మకాం మార్చేశారు. వివాహ అనంతరం అమల సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులకే అక్కినేని అఖిల్ కు జన్మనిచ్చారు. కాగా అఖిల్ అఖిల్ చిన్న వయసులోనే సిసింద్రీ సినిమాతో చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు.. అయితే స్టార్ హీరో అవుతాడని అందరు అనుకున్నారు.. కానీ అఖిల్ కు కేరీర్ లో మంచి హిట్ సినిమా పడలేదు.. రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ సినిమా కూడా నిరాశను మిగిల్చింది.. చూద్దాం ఒక్క హిట్ అయిన పడుతుందేమో..