కొత్త టాలెంట్‌ను వెతికి వెతికి పట్టుకోవడంలో దర్శకుడు తేజ తర్వాతే ఎవరైనా. ఇప్పటివరకు ఆయన బోలెడంత మందిని ఇండస్ట్రీలోకి పట్టుకొచ్చాడు. ఉదయ్‌కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యువ హీరోలను పరిచయం చేసిన ఘనత ఆయనదే. రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఆయన పరిచయం చేసిన నటులు, సాంకేతిక నిపుణులు వెయ్యికి పైగామాటే అట. ఈ ఫిగర్‌ను బట్టి చూస్తే తెలుస్తుంది తేజ కొత్త వాళ్లను ఏ స్థాయిలో ఎంకరేజ్ చేస్తాడో అని.
సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మరో ఐదు రోజుల్లో విడుదల కానుంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్‌లతో సినిమాపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అహింస ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా జరిపారు. ఇందులో తేజ సినిమాకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు. అలాగే షకీలాకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు.
షకీల గురించి కామేశ్వరి అనే సినిమా చూసి తెలుసుకున్నట్లు చెప్పాడు. అయితే ఆమెకు ఎందుకు అంత క్రేజ్ ఉందా అనుకుని తను కూడా టిక్కెట్ తీసుకుని హాల్‌లోకి వెళ్లాడట. షకీలా తెరపై కనపడగానే కుర్రాళ్లందరూ హారతులు పడుతన్నారట. ఆ క్రేజ్ చూసి తేజ ఆశ్చర్యపోయాడట. అదే సమయంలో జయం సినిమాలో లెక్చరర్ పాత్రకు తనే అని ఫిక్సయిపోయినట్లు తెలిపాడు. అలా తను నటీనటులను ఎంపిక చేసే విధానం ఉంటుందని తేజ చెప్పుకొచ్చాడు. సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన తేజ చిత్రం సినిమాతో మెగాఫోన్ పట్టాడు. తొలి సినిమానే ఆయనకు తిరుగులేని విజయాన్నిచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కొంత కాలానికే పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.