‘భలే మంచి రోజు’ సినిమాతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీరామ్ ఆదిత్య, తన భార్యతో కలిసి ఓ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ జీవితంలో జరిగిన కొని కీలక విషయాలను, మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. సినిమాల్లో ట్విస్టులు ఉన్నట్టుగానే తన జీవితంలోనూ చాలా మలుపులున్నాయన్న శ్రీరామ్.. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తాను ఫేస్ బుక్, గూగుల్ లో పనిచేసిన సమయంలో కథలు రాసుకున్నానని చెప్పుకొచ్చారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చానని తెలిపారు.

తాజాగా ఓ ఇంటర్ద్యూలో పాల్గొన్న ఆయన వాళ్ల పెళ్లి గురించి చెప్పారు. మాకు రెండు పెళ్లి రోజులుంటాయి. వాళ్లింట్లో వాళ్లు అంగీకరించరు అని తెలిశాక వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా ఫ్రెండ్స్ చాలా సాయం చేశారు. ఇప్పుడు నవ్వుతున్నాం కానీ ఆ టైమ్లో మాత్రం చాలా కంగారు పడ్డాం. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో చూపించినట్లు కార్లు మారి వేరే ప్రాంతానికి వెళ్లాం. పెళ్లి చేసుకున్నానని మా ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి చెప్పాను. వాళ్లు ఇంటికి వచ్చేయండన్నారు. మా బంధువులందరినీ పిలిచి మళ్లీ పెళ్లి చేశారు. అని చెప్పారు.

ఇక శ్రీరామ్ ఆదిత్య సినీ ప్రయాణం గురించి చెప్పాలంటే.. ‘శమంతకమణి’, ‘దేవదాస్’, ‘హీరో’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హీరో శర్వానంద్ తో ఓ సినిమా చేస్తోన్న ఆదిత్య.. స్టార్ డైరెక్టర్ అయ్యేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ సమయంలో తప్ప మామూలుగా అంతగా బయట కనిపించని ఆయన.. రీసెంట్ గా తన భార్యతో కలిసి ఓ షోలో పాల్గొనడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తన స్టోరీ గురించి చెప్పడం అందర్నీ ఆకర్షిస్తోంది.