‘మేము ఫేమస్’ మూవీ ఫుల్ రివ్యూ.. ఒక చక్కటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్

- Advertisement -

నటీనటులు : సుమంత్ ప్రభాస్ , మణి ఎగుర్ల , మౌర్య చౌదరి , సార్య,సిరి రాశి, అంజి మామ, మురళి ధర గౌడ్ తదితరులు

దర్శకుడు : సుమంత్ ప్రభాస్
సంగీతం : కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ : శ్యామ్
ఎడిటర్ : సృజన
నిర్మాతలు : అనురాగ్ రెడ్డి , శరత్ , చంద్రు మనోహరన్

ఈమధ్య పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద ఘానా విజయాలు సాధిస్తున్నాయి, తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రాలు ఫుల్ రన్ లో భారీ విజయాలుగా నిలిచి కోట్ల రూపాయిల లాభాలను బయ్యర్స్ కి తెచ్చిపెడుతున్నాయి. ఈ సమ్మర్ మొత్తం అలాంటి సినిమాలదే హవా. దర్శక నిర్మాతలు కూడా అలాంటి తక్కువ బడ్జెట్ ఎక్కువ కంటెంట్ ఉన్న సినిమాలపై మరియు కొత్త టాలెంట్స్ పైనే ఎక్కువ ద్రుష్టి సారిస్తున్నారు. అలా రీసెంట్ గా ప్రమోషనల్ కంటెంట్ ద్వారా సోషల్ మీడియా లో ఉన్న నెటిజెన్స్ మొత్తం మాట్లాడుకునేలా చేసిన చిత్రం ‘మేము ఫేమస్’. మొదటి నుండి ఆసక్తి కరమైన కంటెంట్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా గురించి నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాజిటివ్ గా ట్వీట్ వెయ్యడం తో ఒక్కసారిగా హైప్ తారాస్థాయికి చేరుకుంది. నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

- Advertisement -
మేము ఫేమస్
మేము ఫేమస్

కథ :

ఎలాంటి పని పాటలేకుండా, ఊర్లో గాలి తిరుగుడు తిరిగే ముగ్గురి యువకుల కథ ఇది. మహి , బాలి , దుర్గ (సుమంత్ ప్రభాస్ , మణి , మౌర్య) ముగ్గురు చిన్నతనం నుండి కలిసి మెలిసి పెరిగిన స్నేహితులు. వీళ్ళు తిరిగే గాలి తిరుగుడికి తోడు ప్రేమలో కూడా పడుతారు. మహి తన మేనమామ (మురళీధర్ గౌడ్) కూతురు మౌనిక (సిరి) ప్రేమలో పడగా, బాలి బబ్బీ( సార్య) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఊర్లో ఈ ముగ్గురుకి తరచూ ఎదురయ్యే అవమానాలు తట్టుకోలేక ఎదో ఒక పని చెయ్యాలనే ఉద్దేశ్యం తో ముగ్గురు కలిసి ఒక టెంట్ హౌస్ ని ప్రారంభిస్తారు. ఈ టెంట్ హౌస్ ప్రారంభం లో మంచి లాభాల్నే తెచ్చిపెడుతుంది కానీ, కొన్ని కొత్త సమస్యలు కూడా ఈ టెంట్ హౌస్ వల్లే వస్తాయి. ఆ సమస్యలను ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఎలా ఎదురుకున్నారు? అనేదే మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

ఈ చిత్రం లో హీరో గా నటించిన సుమంత్ ప్రభాస్, దర్శకత్వం మరియు కథ కూడా రాసాడు. ఇంత చిన్న వయస్సులో ఒక కొత్త కుర్రాడు ఇంత పెద్ద బాధ్యతలను మోస్తూ సినిమా తియ్యడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎంతో అనుభవం ఉన్న వాడిలాగా ఈ సినిమాలో నటించాడు మరియు దర్శకత్వం వహించాడు కూడా. పెద్ద కాంప్లెక్స్ కథ ని ఎంచుకోకుండా, సరదాగా సాగిపోయే ఒక యూత్ ఫుల్ సబ్జెక్టు ని ఎంచుకొని ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ మరియు ఎమోషన్స్ సమపాళ్లలో ఉండేట్టు గా చేసాడు. ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు, అలాగే ఇంటర్వెల్ సన్నివేశం తో సెకండ్ హాఫ్ లో ఏమి జరగబోతుంది అనే ఉత్కంఠ ఆడియన్స్ లో కలిగించడం లో సక్సెస్ అయ్యాడు సుమంత్ ప్రభాస్.

ఇక సెకండ్ ప్రారంభం లోనే మనకి స్టోరీ అర్థం అయిపోతుంది, క్లైమాక్స్ కూడా ఎలా ఉండబోతుంది అనేది తెలిసిపోతాది. కంటెంట్ లేని అలాంటి సమయం లో లాగ్ చెయ్యడం ప్రతీ డైరెక్టర్ కి కామన్. ఇందులో కూడా సుమంత్ ప్రభాస్ ఒక 20 నిమిషాల పాటు బాగా ల్యాగ్ చేసాడు. కానీ లిప్ స్టిక్ సన్నివేశం మరియు మహి మౌనిక కల్లు తాగే సన్నివేశం సెకండ్ హాఫ్ లో బాగా నవ్విస్తాయి. ఇక్కడే కంటెంట్ లేనప్పుడు బోర్ కొట్టకుండా ఎలా చెయ్యాలి అనే దాంట్లో తన ప్రతిభ ని చాటుకున్నాడు సుమంత్ ప్రభాస్. అలా సినిమా మొత్తం సరదాగా తెలంగాణ నేటివిటీ కి తగ్గట్టుగా సాగిపోతుంది. ఇక నూతన సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ సంగీతం కూడా ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా వీక్ గా ఉన్న సెకండ్ హాఫ్ ని ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపాడింది అనే చెప్పాలి. అలాగే శ్యామ్ సినిమాటోగ్రఫీ కూడా ఒక పల్లెటూరి వాతావరణం లోకి ప్రేక్షకులు అడుగుపెట్టినట్టుగా అనిపిస్తుంది.

చివరి మాట :

50 మంది కొత్త నటీనటులు మరియు సాంకేతిక నిపుణులతో తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియన్స్ కి ఒక స్ట్రెస్ బస్టర్ గా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. వీకెండ్ సరదాగా మన స్నేహితులతో కలిసి థియేటర్స్ లో ఎంజాయ్ చెయ్యగల యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘మేము ఫేమస్’.

రేటింగ్ : 2.75 /5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here