Bharateeyudu 2 : తెరపైకి మరణించిన నటులు.. భారతీయుడు-2లో సూపర్ టెక్నాలజీ.. శంకరా మజాకా..?

- Advertisement -

Bharateeyudu 2 : డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా తెరకెక్కించడంలో ఈ తమిళ దర్శకుడి రూటే సపరేటు. ఈయన వాడినంతగా టెక్నాలజీని మరే దర్శకుడు వాడుకోలేడంటో అతిశయోక్తి కాదు. అంతే కాదు భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించడంలో శంకర్ సిద్ధహస్తుడు. ప్రస్తుతం శంకర్.. తమిళ స్టార్​ హీరో కమల్ హాసన్​ ప్రధాన పాత్రలో భారతీయుడు-2 సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రం భారతీయుడు సినిమాకు సీక్వెల్​ అని సినీ వర్గాల్లో టాక్. అయితే ప్రస్తుతం ఈ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Bharateeyudu 2
Bharateeyudu 2

ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి షూటింగ్ మొదలయ్యే వరకూ ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మాత్రం చాలా స్పీడుగా నడుస్తోంది. అయితే ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్న ఒకరిద్దరు నటులు.. సగం చిత్రీకరణ అయిన తర్వాత కన్నుమూశారు. మిగతా సగం షూటింగ్ పెండింగ్​లో ఉంది. అయితే భారీ బడ్జెట్​లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు ఆ నటులను రీప్లేస్ చేస్తే వాళ్లకు పారితోషికాలు.. మళ్లీ రీ షూటింగ్​కు అయ్యే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే శంకర్ ఓ క్రేజీ ఐడియాను ఆలోచించాడు.

టెక్నాలజీ వాడటంలో శంకర్ దిట్ట. అద్భుతంగా టెక్నాలజీ వాడుకునే వారిలో సినిమా ఇండస్ట్రీలో శంకర్​ను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే భారతీయుడు-2 సినిమాకు వచ్చిన ఈ సమస్యను పరిష్కరించడానికి కూడా శంకర్ టెక్నాలజీని వాడాలని నిర్ణయించాడు. ఈ సినిమాలో కూడా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి.. మన మధ్య లేనివారిని సైతం కళ్లకు కట్టినట్లు తెరపై చూపించబోతున్నారట. ఇంతకీ ఆ నటులు ఎవరు.. వారి పాత్రలేంటో చూద్దామా..?

- Advertisement -
Kalm Haasan

తమిళ నటుడు వివేక్.. భారతీయుడు – 2 సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన షూటింగ్ మొదలైన కొన్ని రోజుల్లోనే గుండెపోటుతో మరణించారు. మరో మలయాళ నటుడు నెడుముడి వేణు కూడా భారతీయుడు – 2లో కీలక పాత్ర చేస్తున్నారు. ‘భారతీయుడు’లో సేనాపతిని పట్టుకునే పోలీస్‌ అధికారి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే కరోనా బారిన పడ్డ ఆయన.. తర్వాత కోలుకోలేక ఆయన కూడా కన్నుమూశారు.

అయితే వీరు మరణించే ముందు.. షూటింగ్ ప్రారంభమైన కొత్తలో వీరి కాంబినేషన్​లో కీలక సన్నివేశాలు తీశారు. ఇప్పుడు ఆ సీన్స్ రీషూట్ చేయడం వల్ల ఖర్చు, సమయం రెండూ వృధా. అందుకే డైరెక్టర్ శంకర్ వారి ముఖచిత్రాలను సీజీఐ (కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజరీ) ద్వారా తెరపై చూపించనున్నారట. ఇలాంటి టెక్నాలజీని వాడటం హాలీవుడ్​లో కొత్తేమీ కాదు. కానీ భారతీయుడు – 2 కోసం శంకర్ ఈ సాంకేతికతను వాడటం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది.

భారతీయుడు – 2 చిత్రంలో సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ.350కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com