DilRaju: దిల్ రాజు టాలీవుడ్లో సక్సెస్ గ్రాఫ్ ఎక్కువగా ఉన్న నిర్మాత. విరామం లేకుండా మంచి సినిమాలను తన ప్రొడక్షన్ హౌస్ నుంచి అందిస్తుంటారు. ఆ బ్యానర్లో పరిచయమైన వారు ఎంతో మంది హీరోలుగా, దర్శకులుగా ప్రస్తుతం ఇండస్ట్రీ లో మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ కొడుకులు హీరోలుగా, దర్శకుల కొడుకులు హీరోలుగా లాంఛ్ అవడం చూస్తూనే ఉంటాం. కానీ స్టార్ హీరోల వారసత్వంగా వచ్చిన వాళ్ల దాటికి తట్టుకోలేక చాలా మంది యాక్టింగ్ వైపు దృష్టి మరల్చక వాళ్ల పేరెంట్ లాగే అదే ప్రొడ్యూసర్ గానో, డైరెక్టర్ గానో పరిశ్రమలో కొనసాగుతున్నారు.

దిల్ రాజుకి ఇండస్ట్రీలో ప్రస్తుతానికి వారసులు లేకపోవడంతో ఈయన ఫ్యామిలీ హీరోలు ఎవరు రాలేదు. దీంతో దిల్ రాజుకి వారసుడుగా ఆయన మేనల్లుడు ఆశిష్ ను రౌడీ బాయ్స్ సినిమాతో వారసుడిగా ఎంట్రీ ఇప్పించాడు. అయితే తన వారసుడిగా ఆశిష్ లాంచ్ అవడంతో, తన సినిమాల విషయంలో దిల్ రాజు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తన ఫస్ట్ సినిమా అయిన రౌడీ బాయ్స్ యూత్ ని టార్గెట్ చేస్తూ తీశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో ఇప్పుడు మాస్ ఆడియన్స్ టార్గెట్ చేస్తూ దిల్ రాజు పాత బస్తీ నేపథ్యంలో సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడై విశాల్ కాశీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ఆశిష్ మూడో సినిమాను సెట్ చేశారు దిల్ రాజు.

సోమవారం పూజా కార్యక్రమంతో మూవీ ప్రారంభమైంది. హారర్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాతో అరుణ్ డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా ఆటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ డీవోపీ బాధ్యతలు స్వీకరిస్తు్న్నారు. దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఆశిష్ హర్రర్ మూవీ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.