Aditi Rao Hydari టాలీవుడ్ లో తన అందచందాలతో కుర్రకారుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ అదితి రావు హయాద్రి.. ఈమె గత కొంత కాలం నుండి ప్రముఖ హీరో సిద్దార్థ్ తో ప్రేమలో ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.సిద్దార్థ్ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘మహాసముద్రం’ సినిమాలో అదితి రావు హయాద్రి సిద్దార్థ్ కి జోడి గా నటించింది.సినిమా అయితే పెద్ద ఫ్లాప్ అయ్యింది కానీ, వీళ్లిద్దరికీ మాత్రం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

గడిచిన కొద్ది రోజుల నుండి ఈ జంట ఎక్కడ పడితే అక్కడ చెట్టాపట్టాలేసుకొని తిరగడం, దానికి తోడు రీసెంట్ గా ప్రముఖ హీరో శర్వానంద్ నిశ్చితార్థం కి జంటగా రావడం వంటివి గమనిస్తే వీళ్లిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారు, లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారనే విషయం అర్థం అవుతుంది.అయితే సిద్దార్థ్ కి ఇదేమి మొదటి ప్రేమ కాదు, గతం లో ఆయన ఇలాంటి ట్రాక్స్ చాలానే నడిపాడు,అవి మనకి కూడా తెలుసు.

అదితి హయాద్రి కి కూడా ఇది మొట్టమొదటి ప్రేమ కాదు, 2009 వ సంవత్సరం లో ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రా ని పెళ్లాడింది., అయితే వీళ్లిద్దరి మధ్య తరుచూ విభేదాలు వస్తుండడం వల్ల 2013 వ సంవత్సరం లో విడిపోవాల్సి వచ్చింది. సత్యదీప్ మిశ్ర బాలీవుడ్ లో స్టార్ హీరో అనలేం కానీ, పాపులర్ హీరో అని మాత్రం కచ్చితంగా చెప్పగలం.

ఇతను నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్స్ అయ్యాయి, అందులో ‘నో వన్ కిల్లెద్ జెస్సికా’ అనే సినిమా ఇతనికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. అదితి రావు హయాద్రి తో ఇతనికి విడాకులు అయిపోయిన తర్వాత మసాబా గుప్త అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.