Heroine Laya టాలీవుడ్ లో అందాల ఆరబోతతోనే నెట్టుకొస్తున్న కొంతమంది హీరోయిన్స్ కి చుక్కలు చూపించిన హీరోయిన్ లయ. బాలనటిగా పలు సినిమాల్లో నటించిన ఈమె ఆ తర్వాత స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమై తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి, ఒకే ఏడాది లో పది సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.
కెరీర్ అంత పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయం లో ఆమె గణేష్ గోత్రి అనే అతనిని పెళ్ళాడి సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. అయితే ఆ తర్వాత చాలా కాలానికి ఆమె రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతే ఆ తర్వాత ఆమె మళ్ళీ మీడియా కి కూడా కనపడలేదు.
ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆమె మీడియా ముందుకి వచ్చి పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. లయ భర్త గణేష్ పెద్ద పారిశ్రామిక వేత్త అని, అతనికి ఉన్న ఆస్తులు వేల కోట్ల రూపాయిల్లోనే ఉంటుందని, ఇలా యూట్యూబ్ మరియు సోషల్ మీడియా లో పలు కథనాలు ప్రచారం అయ్యాయి. ఇదే విషయాన్నీ లయ ని అడగగా ఆమె దానికి సమాధానం చెప్తూ ‘అవును నేను స్వయానా అంబానీ గారికి చెల్లెలు అవుతాను’ అంటూ చెప్పుకొచ్చింది.
యాంకర్ ఒక్కసారిగా షాక్ కి గురి అవ్వడాన్ని గమనించిన లయ వివరణ ఇస్తూ ‘లేకపోతే ఏంటండీ..వృత్తి రీత్యా నా భర్త ఒక డాక్టర్. ఆయనకంటూ ప్రత్యేకంగా ఒక మూడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆదాయం బాగానే వస్తుంది కానీ, సోషల్ మీడియా లో ప్రచారం అయ్యేంత కాదు. ఇప్పటి వరకు మాకు సొంతం గా ఫ్లైట్ కూడా లేదు’ అంటూ చెప్పుకొచ్చింది లయ.