తెలుగు సినీ పరిశ్రమలో తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్న స్టార్ హీరో ఉదయ్ కిరణ్ ఒకరు. 2001లో తెలుగు ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేశాడు హీరో ఉదయ్ కిరణ్. అలాంటి నటుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో లవర్ బాయ్ గా అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు ఉదయ్ కిరణ్. వ్యక్తిగత సమస్యల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయి చాలా ఏళ్లు అయినప్పటికీ ఉదయ్ కిరణ్ గురించిన కొన్ని వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

ఇంతకీ అదీ ఏంటంటే తేజ డైరెక్షన్లో 2001లో విడుదలైన నువ్వు నేను సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు అప్పట్లో పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ఆర్పీ పట్నాయక్ అందించిన ఈ చిత్రంలోని పాటలు అద్భుతమనే చెప్పాలి. అలాంటి చిత్రానికి దర్శకుడు తేజకు నంది అవార్డు వచ్చింది. అంతేకాదు.. నాలుగు ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ కి ఎంతో పేరు వచ్చింది.

ఈ సినిమాలో నటించిన నటీనటులు ఇప్పుడు లేరు. ఇందులో హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇందులో ఉదయ్ కిరణ్‌తో పాటు ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కీలక పాత్రలు పోషించారు. వారు కూడా చనిపోయారు. అదేవిధంగా ఆహుతి ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందారు. ఉదయ్ కిరణ్ తండ్రి పాత్రలో నటించిన వైజాగ్ ప్రసాద్ కూడా చనిపోయాడు. ఈ సినిమాలో నటించిన ఇంత మంది స్టార్ నటులు ప్రస్తుతం లేకపోవడం దురద్రుష్టకరం.