Guess The Actress : క్రింది ఫొటోలో బోసినవ్వులు నవ్వుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?,ఈమె తన అందచందాలతో మొదటి సినిమా నుండే ప్రేక్షకులను మెంటలెక్కిపొయ్యేలా చేసింది. కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం కాకుండా, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పర్చుకుంది.కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు పలు చిత్రాలలో నెగటివ్ రోల్స్ కూడా చేసింది.

మధ్య మధ్య లో ఐటెం సాంగ్స్ లో తళుక్కుమని మెరిసింది కూడా.కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ మరియు బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించి తన సత్తా చాటింది.ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ప్రముఖ టాప్ డైరెక్టర్ తో చేతులు కలిపి నిర్మాతగా కూడా రాణిస్తుంది.ఇన్ని క్లూలు ఇస్తున్నా కూడా ఆమెని కనిపెట్టలేకపోతున్నారా..?,ఆమె మరెవరో కాదండీ,ఆమె మన క్రేజీ హీరోయిన్ ఛార్మి కౌర్.

నీ తోడు కావలి అనే సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయమైనా చార్మీ, ఆ తర్వాత పలు హిందీ మరియు తమిళం సినిమాలలో నటించింది కానీ, ఆమెకి మంచి గుర్తింపు ని తెచ్చిపెట్టింది మాత్రం కృష్ణ వంశీ తెరకెక్కించిన ‘శ్రీ ఆంజనేయం’ అనే సినిమానే.ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ సాధించకపోయినా చార్మ్ నటనకి మంచి గుర్తింపు లభించింది.ఆ తర్వాత వరుసగా నాగార్జున , వెంకటేష్ , బాలకృష్ణ , ప్రభాస్ మరియు ఎన్టీఆర్ వంటి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

మధ్యలో కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా తీసిన ఈమె, జ్యోతి లక్ష్మి అనే సినిమా తర్వాత నటనకి స్వస్తి చెప్పి, పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టింది. ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తప్ప అన్ని ఫ్లాప్స్ అయ్యాయి.రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన లీగర్ కూడా బోల్తా కొట్టడం తో ఛార్మి ఆర్థిక పరిస్థితి ఘోరంగా తయారైంది. ఆమె మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి నిర్మాణ రంగం లో బిజీ అవ్వాలని ఆశిద్దాం.


