Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు సినీ దర్శకుడుగా మంచి సినిమాలను తెరకేక్కించి లెజెండరి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.. రాను రాను ఆర్జీవీ పేరు వివాదాలకు కేరాఫ్ గా మారింది.. ఇక సినిమాలు కూడా అదే విధంగా మారాయి..ఎవరెన్ని అంటున్నా కూడా వర్మ తగ్గేదేలే అంటున్నారు. సోషల్ మీడియాలో వర్మ ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే.. ఎవరిమీద కోపం ఉన్న సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్ చేస్తూ రచ్చ చేస్తారు.. అయితే ఇప్పుడు వర్మ గురించి ఒక వార్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. ఆయన భార్యతో ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలుసా అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.. అసలు నిజాలేంటో వివరంగా తెలుసుకుందాం..

వర్మ క్యారెక్టర్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక అప్పట్లో కూడా అలానే ఉండేవాడు కావచ్చు అందుకనే తన భార్య రత్న కి రాంగోపాల్ వర్మ నచ్చేవాడు కాదట. ఇక ప్రతిరోజు తన భర్త చేసే పనులకు విసిగిపోయి ఇంటికి రాగానే అరవడం స్టార్ట్ చేసేదట. ఆమె ఎంత తిట్టినా కూడా రాంగోపాల్ వర్మ మాత్రం సైలెంట్ గా ఉండే వాడట. లేకపోతే ఇంట్లో నుండి బయటకు వెళ్లేవారట. ఇక రోజు రోజుకు ఆయన హద్దులు మీరడంతో ఓరోజు ఏకంగా ఆయన గురించి ఏం విషయం తెలిసిందో ఏమో కానీ ఇంటికి రావడంతోనే ఆయనను గట్టిగా ఆ విషయం గురించి అడిగేసరికి రాంగోపాల్ వర్మ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడట…

దానికి కోపంతో ఊగిపోయిన ఆవిడ వర్మ కాలర్ పట్టుకొని మరీ గట్టిగా అడిగినా చెప్పకపోవడంతో ఆయన జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టిందట. దాంతో ఆ గొడవ విని రాంగోపాల్ వర్మ తండ్రి అక్కడికి వచ్చి చూడడంతో భర్తను అలాగేనా కొట్టడం అని తిట్టాడట.. దాంతో గొడవలు మరింతగా ముదిరాయి.. ఇక కొట్టుకోవడం కన్నా విడిపోవడం బెస్ట్ అని ఇద్దరు విడిపోయారు… అంతే కాదు ఈ మధ్యకాలంలో ఆయన తెరకెక్కించే సినిమాలన్నీ ఎలా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దాంతో ఈయన సినిమాలకు ఇండస్ట్రీలో డిమాండ్ లేకుండా పోయింది. ఇక సినిమాల్లో ఈయనకు గుర్తింపు లేకపోయినప్పటికీ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెడుతూ ప్రతిరోజు వైరల్ గా మారుతున్నారు.