ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ ముందు వరుసలో నిలుస్తారు. వీళ్లిద్దరు ప్రేమించుకొని, కొన్నాళ్ళు డేటింగ్ చేసిన తర్వాత 2017 వ సంవత్సరం లో వివాహ బంధం ద్వారా శాశ్వతంగా ఒక్కటయ్యారు. ఆరేళ్ళ వీళ్లిద్దరి దాంపత్య జీవితం లో ఒక పాప కూడా ఉంది. ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఉంటూ ఎంతోమంది దంపతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అయితే విరాట్ కోహ్లీ అనుష్క తో పెళ్ళికి ముందు చాలా మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేసాడట. అందులో సారా జేన్ డయాస్ అనే హీరోయిన్ కూడా ఉంది. ఈమె పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో హీరోయిన్ గా నటించింది.అండర్ 19 ప్రపంచ కప్ విజేతగా కెప్టెన్ గా నిల్చిన రోజుల్లో ఆయన సారా జేన్ తో డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించాయి. అప్పట్లో ప్రధాన న్యూస్ చానెల్స్ అన్నీ కూడా ఈ వార్తని తెగ ప్రచారం చేసింది.
ఇక తర్వాత విరాట్ కోహ్లీ సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తమన్నా తో కలిసి ఒక మొబైల్ యాడ్ షూటింగ్ లో పని చేసాడు. ఈ యాడ్ షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరు ప్రేమలో పడినట్టు కొంత కాలం డేటింగ్ చేసుకున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. అప్పట్లో కోలీవుడ్ మీడియా దీని గురించి పెద్ద రచ్చే చేసింది. అయితే తమన్నా ఈ వార్తలపై ఇప్పటి వరకు స్పందించలేదు.
ఇక కన్నడ స్టార్ హీరోయిన్ సంజన గిల్రాని కూడా కోహ్లీ తో కొంతకాలం డేటింగ్ చేసిందట. అప్పట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ఓనర్ విజయ్ మాల్యా ఇచ్చిన పార్టీ కి విరాట్ కోహ్లీ తో కలిసి సంజన జంటగా హాజరైనట్టు వార్తలు వినిపించాయి.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జుజుబెల్లా లైట్ తో కూడా విరాట్ కోహ్లీ 2012 వ సంవత్సరం నుండి 2014 వరకు డేటింగ్ చేసాడు. ఈ విషయం స్వయంగా జుజుబెల్లా లైట్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది. ‘అవును నిజమే..మేమిద్దరం డేటింగ్ చేసుకున్నాం, ఆ తర్వాత ఇద్దరం ఒక మాటకి మీదకి వచ్చి బ్రేకప్ చేసుకున్నాము’ అని చెప్పుకొచ్చింది.