పవిత్ర – నరేష్ లకు షాక్ ఇచ్చిన రమ్య రఘుపతి.. సినిమాను ఆపేయ్యాలంటూ డిమాండ్..

- Advertisement -

టాలివుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రలు కలిసి నటిస్తున్న సినిమా మళ్లీ పెళ్లి.. ఈ సినిమా రావడం ఏమోగానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో ఫెమస్ అయ్యారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన టీజర్స్ ఏ రేంజులో విమర్శలు అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా విడుదలైన టీజర్ తో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సినిమా పై అభ్యంతరం తెలిపారు.. సినిమా విడుదలను ఆపాలని కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

విడుదలకు ఒక్కరోజు ముందు ఆమె రంగంలోకి దిగారు. మళ్ళీ పెళ్లి చిత్ర విడుదల ఆపేయాలని నాంపల్లి ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ వేసింది. ఈ చిత్రం తన గౌరవానికి భంగం కలిగించేదిగా ఉందని మూవీ విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలి కోరింది. రమ్య రఘుపతి పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. మే 26న మళ్ళీ పెళ్లి విడుదల తేదీగా ప్రకటించారు.

మళ్ళీ పెళ్లి బయోపిక్ కాదు. చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని ఇష్టం లేకపోయినా సమస్యల మధ్య బ్రతుకీడుస్తున్నారు. వాళ్ళ కోసమే ఈ చిత్రం అని నరేష్ అన్నారు. టీజర్, ట్రైలర్ చూస్తే మాత్రం ఇది నరేష్-పవిత్ర లోకేష్-రమ్య రఘుపతి జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారని అర్థం అవుతుంది. నరేష్-పవిత్ర లోకేష్ తమ పాత్రలు తామే చేస్తున్నారు. రమ్య రఘుపతి పాత్రను వనిత విజయ్ కుమార్ చేస్తున్నారు..

- Advertisement -

ఈ సినిమాను తన మూడో భార్య రమ్య రఘుపతి పై రివేంజ్ తీర్చుకునేందుకే మళ్ళీ పెళ్లి చిత్రం అనే వాదన కూడా ఉంది. ఈ వాదనను నరేష్ ఖండించారు. రివేంజ్ తీర్చుకోవడానికి సినిమా తీయాల్సిన అవసరం లేదన్నారు. మళ్ళీ పెళ్లి చిత్రానికి ఎమ్ ఎస్ రాజు దర్శకుడు.

నరేష్ స్వయంగా నిర్మించారు. రమ్య రఘుపతి పిటిషన్ తో విడుదల సందిగ్ధంలో పడింది.. రమ్య రఘుపతి నరేష్ మూడో భార్య. ఈమెతో ఆయనకు విబేధాలు తలెత్తి విడిపోయారు. చాలా కాలంగా విడివిగా ఉంటున్నారు. నరేష్ విడాకులు కోరుతూ పిటిషన్ వేశారు. రమ్య రఘుపతి మాత్రం విడాకులు ఇవ్వనంటున్నారు. కొడుకు భవిష్యత్ కోసం నరేష్ కావాలని ఆమె అంటున్నారు.. మరి దీనిపై నరేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here