ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదలవుతున్న విడుదలవుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’. ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ డ్రామా చిత్రమే ఈ ‘ఆది పురుష్’. కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక బాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో ఈ తిరుపతిలో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్‌పై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేళ తిరుపతి మొత్తం శ్రీరామ నామం తో ప్రతిధ్వనించింది. ఎక్కడ చూసిన రామ నామమే, ఎక్కడ చూసిన రాముడి జండాలే. ఈవెంట్‌కి స్టేజ్‌ని అయోధ్య ఆలయ రూపంలో సెట్ వేశారు. దీంతో వేదికపైకి సెలబ్రిటీలు చెప్పులు లేకుండానే వెళ్లారు. సాధారణంగా ఇలాంటి వేడుకల్లో తక్కువగా మాట్లాడే అలవాటు ఉన్న ప్రభాస్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం అభిమానులతో మమేకమై మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ప్రభాస్‌పై ఈ ఈవెంట్‌కి సంబంధించి ఓ విషయంలో నెగటివిటీ పెరిగింది. ఇంత పవిత్రంగా నిర్వహించిన ఈవెంట్‌కి ప్రభాస్ మద్యం సేవించి వచ్చాడని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై సోషల్‌మీడియాలో అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.
అభిమానుల మధ్య వివాదాలు సాధారణమే. ప్రభాస్, అల్లుఅర్జున్ అభిమానుల మధ్య ఎప్పటినుంచే వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో మాట తూలడం గమనించొచ్చు. ప్రభాస్ అలా మాట్లాడుతున్న ఆ వీడియో క్లిప్‌ను కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. సర్క్యూలేట్ చేసి వెక్కిరిస్తున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ త్రాగి వచ్చాడని, దేవుడి సినిమా ఈవెంట్‌కి కూడా తాగి రావాలా? ఒక్క 3 గంటలు కూడా ఆపుకోలేవా అంటూ ప్రభాస్ పై కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్లు ఇస్తూ మరిన్ని పోస్ట్‌లు చేస్తున్నారు. ప్రభాస్ స్టేజి మీదకి ఎక్కేటప్పుడు కూడా చెప్పులు ధరించలేదని, అది ఆయన దేవుడికి ఇచ్చే విలువ అంటూ ఆయనకి సపోర్ట్ చేశారు. అనవసరంగా ప్రభాస్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.