Prabhas : బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలకు కేంద్ర బిందువుగా నిల్చిన ప్రభాస్ ‘సలార్’ చిత్రం సుమారుగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాలీవుడ్ లో నాన్ రాజమౌళి ఇండస్ట్రీ గా నిల్చిన సంగతి తెలిసిందే. కానీ ప్రభాస్ పొటెన్షియల్ ఇది కాదు. ఆయన సినిమా హిట్ అయితే కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొట్టాల్సిందే. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది.
కానీ ఆ రేంజ్ వసూళ్లు రాబట్టలేకపోవడం తో ఈ సినిమా కమర్షియల్ గా ఎబోవ్ యావరేజి రేంజ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రం రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళం మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వడం ప్రారంభించింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలు పెట్టినప్పటి నుండి ఈ చిత్రానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అసలు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంత అద్భుతంగా స్టోరీ టెల్లింగ్ చేసాడు, ఇండియా లోనే ది బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ ఆయన అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తారు ఫ్యాన్స్. అంతే కాదు సలార్ రెండవ భాగం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని, మొదటి భాగం కమర్షియల్ గా మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదని చెయ్యడం మానేస్తారేమో, అసలు కుదరదు సలార్ 2 రావాల్సిందే అంటూ అభిమానులు ప్రశాంత్ నీల్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ప్రభాస్ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు డైలాగ్స్ చాలా తక్కువగా మాట్లాడాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఎంత తక్కువగా మాట్లాడాడు అంటే సినిమా మొత్తం మీద ఆయన డైలాగ్స్ ని కలిపితే నాలుగు నిమిషాల నిడివి కూడా రాలేదట. ఇది తెలుసుకున్న తర్వాత మరీ ఇంత దారుణమా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు.