మెగా డాటర్ నిహారిక గత కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.. అయిన కూడా నిహారిక మాత్రం అసలు స్పందించలేదు.. బోల్డ్ నెస్ ను పెంచుతూ సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. ఇక చైతన్య కూడా ఈ విషయం పై ఎప్పుడు నోరు విప్పలేదు.. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది.. వీరిద్దరినీ కలపడానికి లావణ్య సంచలన నిర్ణయం తీసుకుందని త్వరలోనే వీరిద్దరినీ కలుపుతుందని అంటున్నారు..

మెగా ఫ్యాన్స్ కి ఈ వివాహ మహోత్సవం ఒక మధురమైన జ్ఞాపకం లాంటిది. అయితే నిహారిక కి వరుణ్ తేజ్ కాబొయ్యే భార్య లావణ్య త్రిపాఠి బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం తెలిసిందే. ఆమె నిహారిక మరియు చైతన్య ని కలపడానికి చాలా ప్రయత్నాలే చేసిందట. వాస్తవానికి వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి గత ఏడాదే జరగాలి, కానీ నిహారిక కాపురం చక్కబడే వరకు మన పెళ్లిని ఆపుదాం అని లావణ్య అందట అయితే ఇప్పుడు కలిసేలా లేరని పెళ్లికి ఒప్పుకుందట.. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తుండటంతో త్వరగానే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉందని తెలుస్తుంది..
ఇకపోతే నిహారిక ఫ్రెండ్స్ తో వేకెషన్స్ ను ఎంజాయ్ చేస్తుంది.. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.. సినిమాల్లో హీరోయిన్ గా రానించాలనే ఆలోచనలో కూడా ఉందట.. అందుకు ప్రయత్నాలు కూడా చేస్తుందని టాక్.. ఈ మధ్య డెడ్ ఫిక్సెల్ ను చేసింది.. ఓ మాదిరిగా ఆ సిరీస్ ఆకట్టుకుంది.. ఇక వరుణ్ తేజ్ కూడా వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు..