Ravanasura నుండి తొలగించిన సన్నివేశం ఇదే.. ఇంత దారుణంగా ఉందేంటి!

- Advertisement -

Ravanasura మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘రావణాసుర’ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది.ఈ సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ తో మునిగిపోయింది.రీసెంట్ గానే ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు A రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.అదేంటి టీజర్ మరియు ట్రైలర్ చూస్తుంటే రవితేజ మార్క్ తోనే సినిమా ఉన్నట్టు ఉందిగా, A రేటింగ్ ఇచ్చేంత ఏముంది ఈ సినిమాలో అని ఫ్యాన్స్ మరియు ఆడియెన్స్ అనుకున్నారు.

Ravanasura
Ravanasura

అయితే సెన్సార్ కి ముందు ఎడిటింగ్ లో ఈ సినిమాకి సంబంధించిన ఒక క్లిప్ సోషల్ మీడియా లో విడుదలై వైరల్ గా మారింది.ఆ డైలాగ్ విన్న తర్వాత ఈ చిత్రానికి A రేటింగ్ ఇవ్వడం లో తప్పు లేదు అని అనిపించక తప్పదు.ఈమధ్య కాలం లో అడల్ట్ కంటెంట్ పేరుతో ఆడవాళ్ళ పై ఎలాంటి డైలాగ్స్ పడితే అలాంటి డైలాగ్స్ రాసేస్తున్నారు డైరెక్టర్స్.

ravi teja

రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ మరియు రానా కాంబినేషన్ లో వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో ఇలాంటి డైలాగ్స్ ని మనం చూడవచ్చు.అది పెద్ద వివాదాలకు దారి తీసింది, ఇప్పుడు ‘రావణాసుర‘ లో కూడా ఇదే రేంజ్ డైలాగ్స్ పెట్టారు.’కంచం ముందుకు..మంచం మీదకి ఆడపిల్లలు పిలవగానే రావాలి..రా’ అంటూ రవితేజ పలికిన డైలాగ్స్ ని మీరు క్రింది వీడియో లో చూడవచ్చు.

- Advertisement -

చూస్తూ ఉంటే ఇందులో రవితేజ పూర్తి స్థాయి నెగటివ్ రోల్ చేసినట్టు అనిపిస్తుంది.కానీ ఒక పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా ఈ రేంజ్ డైలాగ్స్ చెప్పడమే ఫ్యాన్స్ కి మింగుడు పడడం లేదు , సినిమాలో ఇలాంటి కంటెంట్ చాలానే ఉంటుందట.రేపు విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి, ట్రైలర్ కి అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.సినిమాలో ట్విస్టులు ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ చేస్తుంది అంటున్నారు,అందులో ఎంత మాత్రం నిజం ఉందొ మరికొద్ది గంటల్లో తేలనుంది.

ravi
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here