Deepthi Sunaina : దీపూ నిన్నిలా చూడలేకపోతున్నాం.. అర్జెంటుగా నువ్వు హీరోయిన్ అయిపో

- Advertisement -

Deepthi Sunaina : దీప్తి సునయన.. ఈ యూట్యూబర్ కమ్ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గురించి తెలియని వారుండరు. సాధారణంగా కాస్త ఫేమ్ రాగానే సినిమాల్లో ట్రై చేస్తుంటారు చాలా మంది. కానీ ఈ భామ మాత్రం ఎంత క్రేజ్ వచ్చినా ఇప్పటి వరకు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించలేదు. ప్రస్తుతం తాను యూట్యూబర్ గా హాయిగా ఉన్నానని చెబుతోంది.

ఈ దీప్తి యూట్యూబ్ లో మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ భామ నటించిన చూస్తూ చూస్తూనే అనే పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత వరుస హిట్లు అందుకుంది. తట్టుకోలేదే, ఏమయ్యుండచ్చో, చిలకా, ఏమోనే అనే పాటలతో బ్యాక్ బు బ్యాక్ హిట్ సాంగ్స్ ఇచ్చింది. ఈ భామ నటించిన ప్రతి సాంగ్ హిట్టే. ఇక ప్రతి సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ సూపర్ హిట్.

- Advertisement -

సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో దీప్తి చాలా యాక్టివ్. రోజు తన వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది కూడా. తాజాగా దీప్తి తన లేటెస్ట్ ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేసింది. ఇందులో దీప్తి చాలా చాలా అందంగా కనిపిస్తోంది.

పింక్ కలర్ అనార్కలీ డ్రెస్సులో దీప్తి సునయన అతిలోక సుందరిలా కనిపిస్తోంది. ఈ ఫొటోలకు సమయం వెనకే చేసా పయనం అంటూ, వీడియోకు ఓసారిలా చూడే చలి అంటూ ఎందుకంటే ప్రేమంట సినిమాలోని నీచూపులే నా ఊపిరి పాట లిరిక్స్ క్యాప్షన్ గా పెట్టింది.

ఇక వీడియోకు కూడా అదే సాంగ్ యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇందులో దీప్తి అందం, క్యూట్ నెస్ ను చూసిన నెటిజన్లు దీపూ నిన్నిలా చూడలేకపోతున్నాం..  అర్జెంట్ గా నువ్వు హీరోయినయిపో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో నిజం దీపూ నువ్వు హీరోయిన్ మెటీరియల్ అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here