Deepika Padukone : దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకొని ఒక సూపర్ స్టార్ హీరో కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు దీపికా పదుకొనే. ఈమె కేవలం హీరోల పక్కన రొమాన్స్ చేసే హీరోయిన్ మాత్రమే కాదు, లేడీ ఓరియెంట్ సినిమాలు చేసి బాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేసిన హీరోయిన్ కూడా.
అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘కల్కి’, అలాగే హ్రితిక్ రోషన్ తో కలిసి ‘ఫైటర్’ అనే సినిమాలలో నటిస్తుంది. ఈమె ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ జంట కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. వీళ్లిద్దరు కలిసి రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ అనే పాపులర్ బాలీవుడ్ టాక్ షో లో పాల్గొన్నారు.
ఈ టాక్ షో లో కరణ్ జోహార్ దీపికా ని అడిగిన పలు ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఎంతో మంది సూపర్ స్టార్స్ తో కలిసి నటించావు, కానీ ఏ హీరో తో నీకు కెమిస్ట్రీ మరియు రొమాన్స్ పర్ఫెక్ట్ గా కుదిరింది అని దీపికా పదుకొనే ని అడుగుతాడు.
అప్పుడు దీపికా సమాధానం ఇస్తూ, నేను షారుఖ్ ఖాన్ తో 6 సినిమాలు చేశాను, నా భర్త రణవీర్ సింగ్ తో నాలుగు సినిమాలు చేశాను. కానీ వీళ్లిద్దరి కంటే నాకు కెమిస్ట్రీ హ్రితిక్ రోషన్ తో బాగా కుదిరింది. రేపు ‘ఫైటర్’ సినిమాలో మా మధ్య జరిగే కెమిస్ట్రీ మరియు రొమాన్స్ ని చూసి ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు చూడండి అంటూ తన భర్త రణవీర్ సింగ్ ని పక్కనే కూర్చోబెట్టుకొని దీపికా పదుకొనే ఈ కామెంట్స్ చేసింది.