Bigg Boss Nayani Pavani : యావర్ తో ప్రేమాయణం..గౌతమ్ తో డేటింగ్..ఆశ్చర్యపరుస్తున్న బిగ్ బాస్ బ్యూటీ నయనీ పావని రాసలీలలు!

- Advertisement -

Bigg Boss Nayani Pavani : గత ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మనమంతా చూసాము. ఈ షో లో పాల్గొన్న ప్రతీ కంటెస్టెంట్ కి మంచి క్రేజ్ వచ్చింది. కొంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టారు, వాళ్ళు కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అలా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి, వారం రోజులకే బయటకి వచ్చిన కంటెస్టెంట్ నయనీ పావని అనే విషయం మన అందరికీ తెలిసిందే.

Bigg Boss Nayani Pavani
Bigg Boss Nayani Pavani

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో అర్జున్ తర్వాత ఆడియన్స్ అందరికీ బాగా కన్సెక్ట్ అయ్యింది నయనీ పావనినే. హౌస్ లో కూడా ఆమె దాదాపుగా ప్రతీ కంటెస్టెంట్ తో వచ్చిన వారం రోజుల్లోనే బాగా కనెక్ట్ అయిపోయింది. ఆమె ఎలిమినేట్ అయిన రోజు కంటెస్టెంట్స్ మొత్తం ఏ రేంజ్ లో ఏడ్చారో మన అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా అదే రేంజ్ లో కంటెస్టెంట్స్ కి కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ప్రిన్స్ యావర్ తో కలిసి ఆమె చేస్తున్న ఇంస్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తున్నాయి. అంతే కాదు వీళ్ళు సోషల్ మీడియా లో అప్లోడ్ చేసే రొమాంటిక్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

వీళ్ళ మధ్య ప్రేమ నడుస్తుందో లేదో తెలియదు కానీ, రీసెంట్ గా ఈమె మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌతమ్ తో కూడా రొమాంటిక్ ఫోటోలు అప్లోడ్ చెయ్యడం నెటిజెన్స్ ‘యావర్ తో ప్రేమాయణం..గౌతమ్ తో డేటింగ్..నీ పని బాగుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గౌతమ్ తో దిగిన రొమాంటిక్ ఫోటోలు కేవలం ఒక కవర్ సాంగ్ కోసం చేసింది మాత్రమే, ఇష్టమొచ్చినట్టు మాట్లాడకండి అంటూ నయనీ పావని టీం క్లారిటీ ఇచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here