Dasara: నాచురల్ స్టార్ నాని తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం దసరా.. ఈ సినిమాకు దాదాపుగా రూ.80 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే నాని గత చిత్రాల బడ్జెట్ తో పోల్చుకుంటే.. ఇది ట్రిపుల్ అని చెప్పవచ్చు.. కథ పై నమ్మకంతో మేకర్స్ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకు బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది.. ఒక పెద్ద విలేజ్ సెట్ కూడా నిర్మించారు. ఇందుకోసం కోట్లు వెచ్చించారు నిర్మాతలు. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా నాని తిరిగి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే చెన్నై , బెంగళూరు వెళ్ళిన టీం నెక్స్ట్ నార్త్ ఇండియాలో కూడా ప్రమోషన్స్ ప్లాన్ చేయడం జరిగింది. మరో రెండు వారాలు సినిమాను పెద్ద మొత్తంలో ప్రమోట్ చేయబోతున్నారు.
తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది ఈ సినిమా.. సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించారట. అయితే ఇందులో కొన్ని పదాలు మ్యూట్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.. మరి సెన్సార్ సభ్యులు మూవీ కి ఇచ్చిన రివ్యూ విషయానికి వస్తే.. వారు పాజిటివ్‌గా స్పందించినట్లు సమాచారం . దసరా చిత్రంలో హీరో నాని, కీర్తి సురేష్ లు నటన ప్రధాన హైలైట్ గా నిలవబోతోందని వారు స్పష్టం చేశారు. అలాగే మలయాళ నటుడు షైన్ టామ్ చక్కో ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.
విలేజ్ పాలిటిక్స్, వర్గ పోరాటాల నడుమ ఇన్నోసెంట్ ప్యూర్ లవ్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు.. ప్రేక్షకులకు కావలసిన అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు సంతోష్ నారాయణ మ్యూజిక్ ప్లస్ కానుంది . మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దసరా సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఇప్పటివరకు దసరా చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలు అన్నీ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. పైగా సెన్సార్ బోర్డు సభ్యులు ఇచ్చిన రివ్యూ లో కూడా పాజిటివ్ గానే ఉంది. మొత్తానికి ఈ సినిమాపై అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. కానీ ఈ సినిమాతో హిట్ అందుకుంటారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది..