Dasara first review : న్యాచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది.. చిరంజీవి తర్వాత కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకొని ఇండస్ట్రీలో నిలబడ్డాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. ఒక్కమాటలో చెప్పాలంటే కష్టే ఫలి.. ఈయన సినిమాలు కొన్ని లెక్కలు తప్పిన, మరికొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.. తాజాగా మరో సినిమాతో రాబోతున్నాడు..తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాన్ ఇండియన్ స్కేల్ లో చేసిన చిత్రం ‘దసరా’.మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊర నాటు మాస్ సినిమాలకు మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే.ఈమధ్య వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాయి.ఇప్పుడు నాని కూడా అదే దారిలో వెళ్తున్నాడు.సింగరేణి బొగ్గు కార్మికుల చుట్టూ తిరిగే కథతో సినిమా ఉండనుంది..

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన అన్నీ కూడా మంచి టాక్ ను అందుకున్నాయి..ఇప్పటికే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇప్పటికీ ఈ సినిమా నుండి విడుదలైన పాటలు మరియు టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.నాని ఈసారి కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడు అనే క్లారిటీ అందరికీ వచ్చేసింది.నాని మాటల్లో కూడా ఈ సినిమా మరో ‘కాంతారా’ రేంజ్ సెన్సేషన్ అవుతుందనే నమ్మకం బాగా కనిపిస్తుంది.ఈ సినిమా పై మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు..
కాగా, ఈ సినిమాకు సంబందించిన ఒక కాపీని ప్రముఖ నిర్మాతలు చూశారని తెలుస్తుంది.. ఆ సినిమాను చూశాక వాళ్ళు ఏమి మాట్లాడలేదు..ఇది కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ సెన్సేషన్ సృష్టించే సినిమా అని, నాని నటనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు చేతెలెత్తి దండం పెడతారని, ఆయనలో ఇంత ఊర నాటు మాస్ ని మేమెవ్వరం ఊహించలేదని, ముందు నుండి ఈ చిత్రం మీద మాకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో, ఆ అంచనాలకు మించి ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని, పాన్ ఇండియా సినిమాల రికార్డ్స్ బ్రేక్.. కైమాక్స్ అదుర్సని వాళ్ళు నాని కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారని వార్తలు కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి..కీర్తి సురేష్ నటన ఆస్కార్ లెవల్.. ఇక ఒక్కొక్కరు విజ్రుంభించినట్లు విడుదలైన ట్రయిలర్స్, పోస్టర్లు చెబుతున్నాయి.. వింటుంటే సినిమాను చూడాలనిపిస్తుంది కదా.. కాస్త ఆగండి.. మరి కొద్ది రోజుల్లోనే సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలకు నాని సైన్ చేసాడు..