అక్కినేని ఫ్యామిలీ హీరోలకు పాపం గత కొంత కాలం నుండి ఏదీ కలిసి రావడం లేదు.ముట్టుకున్న ప్రతీ సినిమా డిజాస్టర్ గా నిలుస్తుంది, అవి క్లోసింగ్ లో కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోతున్నాయి. అఖిల్ కి వసూళ్లు రావడం లేదంటే , అతని ఇండస్ట్రీ లో ఇంకా స్థిరపడలేదు కదా, ప్లాప్ అయితే కలెక్షన్స్ రాకపోవడం సహజమే అని అనుకోవచ్చు.

కానీ దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో టాప్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున కి కూడా సింగిల్ డిజిట్ షేర్ కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకొని ఇండస్ట్రీ లో స్థిరపడిన అక్కినేని నాగచైతన్య సినిమా ఫ్లాప్ అయినా అదే రేంజ్ వసూళ్లు వస్తున్నాయి. దీనితో అక్కినేని ఫ్యాన్స్ ఇక మా హీరోల పని అయిపోయింది అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.

ఇక నాగచైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ కూడా రీసెంట్ గానే విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. టాక్ అయితే పర్వాలేదు అనే రేంజ్ లోనే వచ్చింది కానీ, కమర్షియల్ గా ఎందుకో డిజాస్టర్ అయ్యింది. క్లోసింగ్ లో ఈ చిత్రానికి కనీసం 7 కోట్ల రూపాయిల వసూళ్లు కూడా రాలేదట.

ఈ చిత్రానికి డైరెక్టర్ వెంకట్ ప్రభు దాదాపుగా 7 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. కస్టడీ చిత్రం ఫుల్ రన్ లో కేవలం 6 కోట్ల 30 లక్షల రూపాయిలను వసూలు చేసింది. అంటే దర్శకుడికి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా రికవర్ అవ్వలేదు అన్నమాట. వెంకట్ ప్రభు ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అంత పెద్ద డైరెక్టర్ తో కూడా ఈ రేంజ్ డిజాస్టర్ కొట్టాడంటే నాగ చైతన్య కి అసలు మార్కెట్ లేదా అనే సందేహం ఫ్యాన్స్ లో మొదలైంది.
