బిగ్ బ్రేకింగ్.. మళ్లీ కలిసిన పవన్ కల్యాణ్, ఆలీ.. ఆ సినిమాలో ఛాన్స్!

- Advertisement -

టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ ఆలీ, ప‌వర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అని అంద‌రికీ తెలుసు. ఫిలిం ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కేవ‌లం కొద్ది మందికి మాత్ర‌మే అత్యంత స‌న్నిహితంగా ఉంటారు. అలాంటి వారిలో ఆలీ ఒక‌రు. దాదాపుగా ప‌వ‌న్ న‌టించిన అన్ని మూవీల్లోనూ ఆలీ న‌టించారంటే వారి మ‌ధ్య ఎంత గాఢ‌మైన స్నేహం ఉందో అర్థం చేసుకోవచ్చు. అనేక ఈవెంట్ల‌లో అనేక మంది ద‌ర్శ‌కులు వారిద్ద‌రి మ‌ధ్య స్నేహం గురించి అనేక విష‌యాలు చెప్పారు.

ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీకి సబంధించిన ఓన్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈసినిమాలో ఓ క్రేజీ రోల్ కోసం స్టార్ సీనియర్ కమెడియన్ అలీని తీసుకున్నట్టు తెలుస్తోంది. అలీ పపర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రతీ సినిమాలో ఉంటాడు. కాని గత కొంత కాలంగా పవర్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన కనిపించడంలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. పవర్ స్టార్ జనసేన పార్టీ అదినేతగా ఉండగా.. అలీ మాత్రం వైసీపీలో కీలక పదవిలో ఉన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ జోడీగా.. సాహో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఓజి. ఈ సినిమాపై రోజుకో బజ్ వినిపిస్తుంది. ఈక్రమంలో ఈసినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేని పోర్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

- Advertisement -
og movie

లేటెస్టుగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నటుడు కమల్… ‘ఓజీ’లో తాను ఓ పాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ముంబైలో జరిగిన చిత్రీకరణలో పాల్గొన్నానని, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ గెటప్ అద్భుతమని చెప్పారు. ఇక, డీవీవీ దానయ్య నిర్మాణంలో రాజీ పడటం లేదన్నారు. బడ్జెట్ ఎంత? అని ప్రశ్నించగా… ‘పూర్తి వివరాలు నాకు తెలియవు. కానీ, 400 – 500 కోట్లు ఉంటుంది’ అని కమల్ చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here