OG క్రేజీ అప్ డేట్.. పవన్ కళ్యాణ్ కి తండ్రిగా అమితాబ్ బచ్చన్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ OG. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకుంది ఈ చిత్రం. గ్యాప్ లేకుండా హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

ప్రస్తుతం ఆయన వారాహి విజయయాత్రలో బిజీగా ఉండడంతో సినిమాలో ఆయనలేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు జులై వరకు కొనసాగుతాయని తెలుస్తోంది. ఆ తర్వాత ఆగష్టులో పవన్ కళ్యాణ్ ఒక 15 రోజులు డేట్స్ కేటాయిస్తే సినిమా పూర్తి అయిపోతుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన కెరీర్లో మొదటి సారిగా డ్యుయల్ చేస్తున్నారని సమాచారం. ఒక పాత్ర పేరు గాంధీ కాగా, మరో పాత్ర పేరు ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ.

అంతే కాకుండా పవన్ తండ్రి పాత్ర కూడా ఉంటుందట.. అది చాలా పవర్ ఫుల్ పాత్ర అట.. ఈ పాత్రకి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని అడుగుతున్నారట. ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయన ఒప్పుకున్నాడా, లేదా అనే సమాచారం త్వరలోనే తెలియనుంది . ఇక పవన్ అన్నయ్య గా కిక్ శ్యామ్, వదినగా శ్రియా రెడ్డి నటిస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది చిత్రయూనిట్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here