Manchu Family : ‘మంచు’ ఫ్యామిలీలో గొడవలు.. ఉప్పు-నిప్పులా విష్ణు-మనోజ్.. ఆమె కారణమట..!

- Advertisement -

టాలీవుడ్​ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ Manchu Family ఒకటి. మిగతా ఫ్యామిలీస్​ కన్నా ఈ కుటుంబం కాస్త డిఫరెంట్. ముక్కు సూటిగా మనసులో ఉన్నది చెప్పేయడం.. డిసిప్లిన్.. పెద్దవాళ్లను గౌరవించడం.. ఈ కుటుంబానికి అలవాటు. ఈ ఫ్యామిలీ హెడ్ కలెక్షన్ కింగ్ మోహన్​బాబు తన పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్నలకు వారసత్వంగా డిసిప్లిన్​ను ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్.

Manchu Family

మోహన్​బాబు ముగ్గురు పిల్లలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లే. మంచు విష్ణు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మంచు మనోజ్ కూడా మంచి ఇమేజ్​ను సంపాదించుకున్నాడు. ఇక మంచు లక్ష్మి ఓవైపు సినిమాలు.. మరోవైపు టాక్ షోలు.. ఇంకోవైపు ఓటీటీల్లో వెబ్ సిరీస్​లతో ముగ్గురిలో తానే ఎక్కువగా బిజీగా గడుపుతోంది.

- Advertisement -

ఈ ముగ్గురు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్​గానే ఉంటారు. అయితే మంచు ఫ్యామిలీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంచు కుటుంబంలో విబేధాలు తలెత్తాయంటూ న్యూస్ వైరల్ అవుతోంది. మోహన్ బాబు ఇద్దరు కుమారులు మంచు విష్ణు-మనోజ్ మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో మోహన్ బాబు ఒకరు. తన విలక్షణ నటనతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారి కలెక్షన్ కింగ్ అయ్యారు. 500 లకు పైగా చిత్రాల్లో నటించి మోహన్ బాబు నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మంచు విష్ణు, మనోజ్ ఫెయిల్ అయ్యారు. మోహన్ బాబు కుమారుల కెరీర్ డిజాస్టర్ అని చెప్పాలి. కనీసం టైర్ టూ హీరోల సరసన చేరలేకపోయారు. ఈ మధ్య కాలంలో మోహన్​బాబు ఫ్యామిలీ హీరోలు నటించిన చిత్రాలు కనీస ప్రభావం చూపలేకపోయాయి. సన్ ఆఫ్ ఇండియా, జిన్నా టాలీవుడ్ ఆల్ టైం డిజాస్టర్స్​గా మిలిగిపోయాయి. విష్ణు, మనోజ్ కెరీర్స్ మోహన్ బాబును తీవ్ర నిరాశకు గురి చేశాయి.

ఈ క్రమంలో మనోజ్ వ్యక్తిగత లైఫ్ కూడా ఒడిదొడుకులకు లోనైంది. 2019 లో ఆయన భార్యతో విడాకులు తీసుకున్నాడు. మనోజ్ వల్ల మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తుతున్నాయనేది ఇండస్ట్రీ టాక్.మంచు విష్ణు-మనోజ్ మధ్య దూరం పెరిగిందని.. వారిద్దరికి మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. మనోజ్ అందుకే తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడట. ఇటీవల మంచు విష్ణు బర్త్ డే జరుపుకున్నాడు. అన్నయ్యకు మనోజ్ స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు. అలాగే విష్ణు కూతుళ్ల బర్త్ డే నేపథ్యంలో విషెస్​ తెలియజేస్తూ మనోజ్ సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. మనోజ్ విషెస్ కి విష్ణు నుంచి ఎలాంటి రిప్లై లేదు. ఆయన కనీసం స్పందించలేదు. మిగతా ప్రతి ఒక్కరికీ మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపాడు.

Manoj And Mounika

ఇక విబేధాలకు కారణం భూమా మౌనికతో మంచు మనోజ్ సన్నిహితంగా ఉండటమే అంటున్నారు. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి కూతురైన మౌనికతో మనోజ్ సన్నిహితంగా ఉంటున్నాడు. వినాయక పండుగ సమయంలో మనోజ్-మౌనిక కలిసి పూజలు చేశాడు. మౌనికను వివాహం చేసుకోవాలని మనోజ్ కోరుకుంటున్నాడట. మంచు విష్ణుతో పాటు కుటుంబ సభ్యులకు ఈ సంబంధం ఇష్టం లేదట. తన మాట వినకుండా మౌనికతో ఉంటున్న మనోజ్ పై కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నారట. ఈ విషయంపై ఇంకా మంచు ఫ్యామిలీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com